
ఐపీఎల్ ట్రోఫీతో వెంకటపతిరాజు తదితరులు
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా నెక్సాన్ కంపెనీ జతకట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు తమ అధికార భాగస్వామిగా టాటా నెక్సాన్ వ్యవహరించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూడేళ్ల పాటు ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని చెప్పింది. ఈ సందర్భంగా వివో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ఐపీఎల్‌కు నెక్సాన్‌ను అధికారిక భాగస్వామిగా ఎన్నుకోవడం తమకు సంతోషంగా ఉందని అన్నాడు.
సుప్రసిద్ధమైన టాటా బ్రాండ్ సేవల్ని పొందడం ఐపీఎల్‌కు ఉపకరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. నెక్సాన్‌తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నామని అన్నారు. ఈ భాగస్వామ్యం పట్ల టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ అధ్యక్షుడు మయాంక్ ప్రతీక్ సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌లో ప్రముఖ క్రికెట్ లీగ్ ఐపీఎల్, వినియోగదారులకు బ్రాండ్లను పరిచయం చేసేందుకు సమర్థవంతమైన వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment