మహ్మద్ షమీ, హసీన్ జహాన్ (ఫైల్ ఫొటో)
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ, అతని భార్య హసీన్ జహాన్‌ల వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఇప్పటికే ఇతర మహిళలతో షమీకి సంబంధాలున్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తనని మానసికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన జహాన్ తాజాగా అతని పుట్టిన రోజు తేది తప్పంటూ మరో ఆరోపణతో వార్తల్లో నిలిచారు.
షమీ పుట్టిన రోజు విషయంలో బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్)లను మోసం చేశాడని, నకిలీ బర్త్ డే సర్టిఫికేట్‌లతో వివిధ కెటగీరిల జాతీయ, రాష్ట్రీయ టోర్నీల్లో పాల్గొన్నాడని ఆరోపిస్తూ.. షమీ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోను రుజువుగా జోడిస్తూ తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. అయితే కొద్ది సేపటికే ఈ పోస్ట్‌ను తొలిగించారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల ప్రకారం షమీ పుట్టిన సంవత్సరం 1990గా ఉండగా జహాన్ షేర్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌లో 1982గా ఉంది.
జహాన్ చేసిన పోస్ట్.. ‘‘ఫ్రెండ్స్.. మహ్మద్ షమీ తన పుట్టిన రోజు తేదీ విషయంలో నకీలీ ధృవీకరణ పత్రాలతో 1990 గా చూపిస్తూ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు. అతను బీసీసీఐ, క్యాబ్‌తో పాటు ప్రజలను మోసం చేశాడు. ఈ తప్పుడు పత్రాలతో అండర్-22 క్రికెట్ టోర్నీలో ఆడాడు. ఈ చర్యతో నిజమైన 22 ఏళ్ల క్రికెటర్ నష్టపోయాడు’’ అని జహాన్ పేర్కొన్నారు.
ఇక ఇప్పటికే జహాన్.. షమీ, అతని కుటుంబ సభ్యులపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేశారు. దీంతో కోల్‌కతా పోలీసులు విచారణ కూడా చేపట్టారు. అంతేగాకుండా షమీ నుంచి భరణం ఇప్పించాలని జహాన్ కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక షమీ ఈ సీజన్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
హసీన్ జహాన్ షేర్ చేసిన షమీ డ్రైవింగ్ లైసెన్స్
Comments
Please login to add a commentAdd a comment