బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మొహమ్మద్ షమీని టీమిండియాలో చేర్చుకుంటారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ మేరకు.. ఇప్పట్లో షమీని హడావుడి జట్టులో చేర్చుకునే పరిస్థితులు లేవు.
షమీ విషయంలో వేచి చేసే ధోరణిని అవళంభించాలని బీసీసీఐ భావిస్తుందట. బోర్డు ప్రస్తుత జట్టులోని బౌలర్లతో సంతృప్తిగా ఉందని సమాచారం. షమీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మరిన్ని మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ కోరుకుంటుంది.
కాగా, షమీ ఏడాది గ్యాప్ (గాయం) తర్వాత కాంపిటేటివ్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ రంజీ మ్యాచ్‌లో షమీ 7 వికెట్లు తీసి రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. రంజీ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన నేపథ్యంలో షమీని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేస్తారని (అప్పటికే జట్టును ప్రకటించారు) అంతా అనుకున్నారు.
తొలి టెస్ట్‌కు ముందు బుమ్రా, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పిన మాటలు ఇందుకు బలం చేకూర్చాయి. షమీ చాలా దగ్గర నుంచి గమినిస్తున్నాము.. అతనికి సంబంధించిన వారితో నిత్యం టచ్‌లో ఉన్నామని బుమ్రా, మోర్కెల్ అన్నారు.
ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సూపర్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 104, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు కుప్పకూలింది.
Comments
Please login to add a commentAdd a comment