హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ దేశంలోని మూడవ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన సరికొత్త అప్‌గ్రేడ్ చేసిన తయారీ సంస్థ టాటా మోటార్స్ నెక్సన్ ఈవీ మ్యాక్స్ శ్రేణిలో ఎక్స్‌జడ్ ప్లస్ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేసింది. వీటిలో ఎక్స్‌జడ్ ప్లస్ 3.3 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ చార్జర్, ఎక్స్‌జడ్ ప్లస్ లక్స్ 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ చార్జర్ వర్షన్లు ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో ధర రూ.18.79 లక్షల నుంచి ప్రారంభం.
హెచ్‌డీ డిస్‌ప్లేతో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ హర్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెచ్‌డీ రేర్ వ్యూ కెమెరా, ఆరు భాషల్లో వాయిస్ అసిస్ట్, మెరుగైన వాయిస్ కమాండ్ వంటి హంగులు ఉన్నాయి. జిప్‌ట్రాన్ టెక్నాలజీతో 40.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. (ఐసీఐసీఐ,పీఎన్‌బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!)
141.04 బీహెచ్‌పీ, 250 ఎన్‌ఎం టార్క్ ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 453 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 9 సెకన్లలో అందుకుంటుంది. నెక్సన్ ఈవీ శ్రేణిలో ఇప్పటి వరకు 45,000 పైచిలుకు కార్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ తెలిపింది.
ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట?
మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్
Comments
Please login to add a commentAdd a comment