ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా టాటా నెక్సన్ ఈవీకి పోటీగా అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకొని వచ్చేందుకు సిద్దం అవుతుంది. మహీంద్రా కంపెనీ నుంచి రాబోతున్న తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యువి కారును రోడ్ మీద టెస్టింగ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి కారు పెట్రోల్, డీజిల్ కారు ప్రస్తుత ఎక్స్‌యువి 300 మోడల్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఎక్స్‌యువి 400 అని పేరు పెట్టే అవకాశం ఉంది. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు గనుక మార్కెట్‌లోకి వస్తే టాటా మోటార్స్ నెక్సన్ ఈవీతో పోటీ పడనుంది. ఈ మహీంద్రా ఈ- ఎక్స్‌యువి400 కారు 350 నుంచి 380 వోల్ట్ సామర్ధ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్ సహాయంతో రానుంది. ఒకవేళ మహీంద్రా ఈ సైజు బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే, అదే విధమైన బ్యాటరీ ప్యాక్ ఉన్న నెక్సన్ ఈవికి వ్యతిరేకంగా ప్రత్యర్థిగా ఉంటుంది. ముంబైకి చెందిన ఈ సంస్థ 2027 నాటికి ఎనిమిది ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు, మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ కారు బయటకు రాలేదు. ఈ ఏడాది చివరి నాటికి ఎక్స్‌యువి400 కారు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కారుకి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదు.
Comments
Please login to add a commentAdd a comment