Mahindra XUV400 Electric SUV India Launch Date, Tata Nexon EV Rival - Sakshi
Sakshi News home page

టాటా నెక్సాన్‌కు పోటీ:మహీంద్ర ఎలక్ట్రిక్  ఎక్స్‌యూవీ 400 లాంచింగ్‌ డేట్‌ ఇదే!

Published Wed, Aug 17 2022 4:00 PM | Last Updated on Wed, Aug 17 2022 5:27 PM

Mahindra XUV400 electric SUV launch on 6th September rival the Tata Nexon EV - Sakshi

సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నమహీంద్రా ఎక్స్‌యూవీ 400 లాంచింగ్‌డేట్‌ రివీల్‌అయింది. ఇండిపెండెన్స్‌ డే నాటి స్పెషల్‌ ఈవెంట్‌లో ఎక్స్‌యూవీతోపాటు 5 ఎలక్ట్రిక్ కార్ల (E8, XUV.E9, BE.05, BE.07  BE.09)ను పరిచయం చేసిన మహీంద్రా తాజాగా ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400 సెప్టెంబర్ 6న విడుదల చేయాలని యోచిస్తోందట. 

టాటా నెక్సాన్ EVకి ప్రత్యర్థిగా మార్కెట్లోకి  అడుగుపెట్టపోతున్న ఈ కారు డెలివరీలు అక్టోబరు నుంచి మాత్రమే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెద్దగా ఆకట్టుకోని REVAi, e2o ,eVerito  తరువాత  మహీంద్రా తీసుకొస్తున్న తొలి ఈవీ ఇది.  ఈ వెహికల్‌లో 150హెచ్‌పీ శక్తిని  అందించే ఫ్రంట్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌, రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నారు. ఎక్స్‌యూవీ 700 మాదిరిగా క్యాబిన్ లోపల, Adreno X ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ADAS,  తదితర ఫీచర్లతో  రాబోతుందని అంచనా.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement