
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ తాజాగా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘నెక్సాన్’లో కొత్త వేరియంట్ ‘నెక్సాన్ ఎక్స్‌జెడ్’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఇది డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. పెట్రోల్ వెర్షన్ ధర రూ.7.99 లక్షల నుంచి, డీజిల్ వెర్షన్ ధర రూ.8.99 లక్షల నుంచి ప్రారంభమౌతోంది.
కొత్త వేరియంట్‌లో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ కెమెరా అసిస్ట్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, డ్రైవ్ అవే లాకింగ్ ఫీచర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. నెక్సాన్ ఎక్స్‌జెడ్‌తో తమ కస్టమర్లకు వివిధ రకాల ప్రీమియం ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ హెడ్ (మార్కెటింగ్) వివేక్ శ్రీవత్స తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment