న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మళ్లీ నష్టాలబాట పట్టింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,451 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,941 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రధానంగా లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) అమ్మకాలపై చిప్‌ల కొరత ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 75,654 కోట్ల నుంచి రూ. 72,229 కోట్లకు క్షీణించింది. అయితే ప్రస్తుత సమీక్షా కాలంలో స్టాండెలోన్ ప్రాతిపదికన టర్న్‌అరౌండ్ పనితీరు చూపింది. రూ. 176 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో రూ. 638 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 9,636 కోట్ల నుంచి రూ. 12,353 కోట్లకు ఎగసింది. ఎగుమతులుసహా మొత్తం వాహన అమ్మకాలు 30 శాతం పెరిగి 2,00,212 యూనిట్లకు చేరాయి. సరఫరా సమస్యలున్నపటికీ వాణిజ్య, ప్యాసింజర్ వాహన విక్రయాలు పుంజుకున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది.
రేంజ్ రోవర్ భళా..
తాజా క్వార్టర్‌లో జేఎల్‌ఆర్ 9 మిలియన్ పౌండ్ల పన్నుకు ముందు నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం కూడా 21 శాతానికిపైగా నీరసించి 4.7 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది. చిప్‌ల కొరత నేపథ్యంలో వాహనాల రిటైల్ అమ్మకాలు 38 శాతం క్షీణించి 80,126 యూనిట్లకు చేరాయి. సెమీకండక్టర్ సరఫరాలతో అమ్మకాలు తగ్గినప్పటికీ తమ ప్రొడక్టులకు పటిష్ట డిమాండ్ కనిపిస్తున్నట్లు జేఎల్‌ఆర్ సీఈవో థియరీ బొలోర్ పేర్కొన్నారు. ఇక టాటా మోటార్స్ ఈడీ గిరీష్ వా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కొత్త రేంజ్ రోవర్ వాహనాల గ్లోబల్ ఆర్డర్‌బుక్ 30,000 యూనిట్లను తాకినట్లు వెల్లడించారు. ఇది సరికొత్త రికార్డుకాగా.. 2022లోనూ చిప్‌ల కొరత సవాళ్లు విసరనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో 10,000 ఈవీ అమ్మకాలు సాధించినట్లు గిరీష్ వెల్లడించారు.
టాటా మోటార్స్‌కి చిప్‌సెట్ల సెగ
Published Tue, Feb 1 2022 10:36 AM | Last Updated on Tue, Feb 1 2022 11:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment