సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం టాటామోటార్స్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ముంబై నగరానికి అందించింది. ఈ బస్సు సర్వీసులను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ప్రారంభించారు. ముంబై మెట్రోపాలిటిన్ రీజయన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంఎంఆర్‌డీఏ) స్థానిక రవాణాశాఖకు 25 హైబ్రీడ్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను టాటా మోటార్స్ అందజేసింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీత్ సమక్షంలో వీటిని ఎంఎంఆర్‌డీఏకు అప్పగించింది.
దేశీయంగా అభివృద్ధి చెందిన ఈ టాటా-స్టార్‌బస్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బస్సులు , గ్లోబల్ డిజైన్ స్టాండర్డ్స్ తో రూపొందించామని టాటా మోటార్స్ వెల్లడించింది. పట్టణ రవాణా కోసం గణనీయమైన సహకారం అందించే దిశగా తక్కువ-ఉద్గార బస్సులను అభివృద్ధి చేయడానికి కంపెనీ కట్టుబడి ఉందని టాటా మోటార్స్ వాణిజ్య వాణిజ్య వాహనాల అధ్యక్షుడు గిరీష్ వాగ్ చెప్పారు. డ్యూయల్ పవర్ (డీజిల్ మరియు ఎలక్ట్రిక్), లిథియం అయాన్ బ్యాటరీలతో ఇవి పనిచేస్తాయన్నారు. విద్యుదీకరణ, ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలపై తమకృషి కొనసాగుతుందని, వీటి ప్రోత్సాహానికిగాను ప్రభుత్వం,ఇతర రెగ్యులేటరీ అధికారులతో కలిసి పనిచేస్తామన్నారు. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020లో భాగంగా ఈ హైటెక్ బస్సుల తయారీని చేపట్టారు. కాగా ఈ బస్సు ప్రొడక్షన్ కాస్ట్ 1.7 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment