కరోనా మహమ్మారి తర్వాత తిరిగి వేగంగా పుంజుకుంది ఏదైనా ఉంది అంటే? అది స్టాక్ మార్కెట్ అని చెప్పుకోక తప్పదు. రోజు రోజుకి రాకెట్ వేగంతో షేర్ మార్కెట్ దూసుకెళ్తుంది. ఈ మధ్య యువతరం మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు మార్కెట్లోకి ప్రవేశించడంతో మార్కెట్ జీవనకాల గరిష్టాలకు చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక బంగారు గనిలో మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. వారి బందువులు గుర్తించలేని స్థితిలో సంపాదిస్తున్నారు. మరికొందరికీ మార్కెట్ పై ఎటువంటి జ్ఞానం లేకపోవడంతో చేతులు కాల్చుకుంటున్నారు.
సాదారణంగా ఒక కంపెనీకి చెందిన ఒకటి లేదా రెండు షేర్లు మాత్రమే లాభాలను తెచ్చిపెడతాయి. కానీ, టాటా గ్రూప్‌కు చెందిన ఏకంగా 8 కంపెనీల షేర్లు మదుపరుల పాలిట కల్పవృక్షం లాగా మారాయి. మన దేశంలో టాటా గ్రూప్‌కు ఉన్న విలువ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాటా గ్రూప్ అంటే "ఒక నమ్మకం". మన దేశంలో కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించే ఏకైక సంస్థగా టాటా గ్రూప్ నిలిచింది.
టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్, టాటా పవర్ కంపెనీ లిమిటెడ్, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వంటి 8 కంపెనీల షేర్లు మదుపరులకు గత 20 నెలలుగా భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. కరోనా వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికి 10 రేట్లకు పైగా పెరిగాయి. 2020 మార్చి నుంచి డిసెంబర్ 3 వరకు టాటా గ్రూప్‌కు చెందిన స్టాక్ ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి.
టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ ధరలు:
- టాటా మోటార్స్ షేర్ ధర - ఏప్రిల్ 3 రూ.65.30 - రూ. 480.30 (డిసెంబర్ 3వ తేదీ)
- టాటా ఈఎల్ఎక్స్ఎస్ఐ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.550.20 - రూ.5,890 (డిసెంబర్ 3వ తేదీ)
- టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ షేర్ ధర - మే 11 - రూ.27.30 -రూ.225.60(డిసెంబర్ 3వ తేదీ)
- టాటా మోటార్స్ లిమిటెడ్ - డీవీఆర్ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 30 - రూ.30 - రూ.258.30(డిసెంబర్ 3వ తేదీ)
- టిన్ ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.59.45 - రూ.280.20(డిసెంబర్ 3వ తేదీ)
- ఎన్ఈఎల్ సీఓ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 24 - రూ.121.30 - రూ.738.05(డిసెంబర్ 3వ తేదీ)
- టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్ ధర - మార్చి 19 - రూ.216.05 - రూ.1303.25(డిసెంబర్ 3వ తేదీ)
- టాటా స్టీల్ బీఎస్ఎల్ లిమిటెడ్ షేర్ ధర - ఏప్రిల్ 3 - రూ.15.55 - రూ.85.35(డిసెంబర్ 3వ తేదీ)
(చదవండి: దేశ చరిత్రలో రికార్డు.. ఎలక్ట్రిక్ వాహనాల జోరు తగ్గట్లేదుగా!)
Comments
Please login to add a commentAdd a comment