హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ మార్కెట్‌పై టాటా మోటార్స్ దృష్టిసారించింది. వినియోగదార్ల ఇంటి వద్దకే కార్లను తీసుకెళ్లాలని నిర్ణయించింది. అనుభవ్ పేరుతో మొబైల్ షోరూంలను (షోరూం ఆన్ వీల్స్) ఆవిష్కరించింది. వీటి ద్వారా వినియోగదార్ల ఇంటి వద్దనే కార్ల విక్రయం, నూతన మోడళ్ల సమాచారం, ఉపకరణాలు, రుణ పథకాలు, టెస్ట్ డ్రైవ్, పాత కార్ల మార్పిడి వంటి సేవలు ఉంటాయి.
దేశవ్యాప్తంగా 103 మొబైల్ షోరూంలను కంపెనీ అందుబాటులోకి తెస్తోంది. సమీపంలోని టాటా మోటార్స్ డీలర్‌షిప్ వీటిని నిర్వహిస్తుంది. జనాభా, ఆర్థిక పరంగా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సంస్థ పరిధిని పెంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం కార్ల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 40 శాతం దాకా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment