సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సఫారీ కారును భారత మార్కెట్లో టాటా మోటార్స్ సోమవారం ఆవిష‍్కరించింది. ఐకానిక్ సఫారీ కొత్త వాహన శ్రేణిని తీసుకొచ్చింది. మొత్తం ఆరు వేరియంట్లలో టాటా సఫారీ 2021 యూఎస్‌వీ కార్లను లాంచ్ చేసింది. పరిచయ ధరగా బేసిక్ మోడల్ ధరను 14.69 లక్షలుగా నిర్ణియించింది కంపెనీ. టాప్ ఎండ్ మోడల్ ఖరీదు 21.45 లక్షలుగా ఉంది. ఇప్పటికే బుకింగ్‌లను మొదలుపెట్టింది. అన్ని అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద రూ. 30 వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.
ఎక్స్‌ఈ, ఎఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌టీ ప్లస్, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్ ప్లస్ అనే మోడళ్లలో టాటా సఫారీ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అడ్వెంచర్ పర్సోనా పేరుతో కొత్త వేరియంట్‌ను కూడా రిలీజ్ చేసింది .దీని విలువ 20.20 లక్షలు (ఎక్స్-షోరూమ్‌న్యూఢిల్లీ) గా ఉండనుంది. కాగా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 2021 టాటా సఫారీని టాటా మోటార్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా ఇది నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment