
టాటామోటర్స్ కంపెనీ షేరు శుక్రవారం మిడ్‌సెషన్ సమయానికి 10శాతానికి పైగా లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో రూ.100.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌లో నెలకొన్న కొనుగోళ్లలో భాగంగా ఈ షేరుకు డిమాండ్ నెలకొంది. ఒక దశలో షేరు 10.50 పైగా లాభపడి రూ.108.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 1గంటకు షేరు మునుపటి ముగింపు(రూ.98.50)తో పోలిస్తే 10శాతం లాభంతో రూ.108.35 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.63.60, రూ.201.80గా ఉన్నాయి. ఇదే సమయానికి సెన్సెక్స్ 200 పాయింట్ల పెరిగి 34180 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 10112.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క ఎఫ్‌ఎంసీజీ షేర్ల తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు లాభపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment