
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్ సీఎండీ సురేశ్ రెడ్డి, సీఎఫ్‌వో నారాయణ రాజు రాజీనామా చేశారు. ఇరువురి రాజీనామాను ఆమోదించినట్టు కంపెనీ బోర్డు ప్రకటించింది. కొత్త సీఈవో, సీఎఫ్‌వో కోసం అన్వేషణ ప్రారంభించేందుకు సైతం బోర్డు ఓకే చెప్పింది.
కాగా, కంపెనీ ఆర్థిక వ్యవహారాలలో అకౌంటింగ్ అక్రమాలు, తప్పుడు స్టేట్‌మెంట్లను వెల్లడించినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విచారణలో తేలడంతో.. ఆగస్టు 22న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు ద్వారా సీఎండీ, సీఎఫ్‌వోలను బోర్డు స్థానాల నుండి సెబీ నిషేధించిన సంగతి తెలిసిందే.
కంపెనీ తన షేర్ల ప్రాధాన్యత కేటాయింపులకు సంబంధించిన బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్లు కల్పితమని సెబీ కనుగొంది. దీనిని అనుసరించి బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లను విక్రయించకుండా శర్మ, 22 ఇతర సంస్థలను సెబీ నిషేధించింది.
Comments
Please login to add a commentAdd a comment