Digital marketing
-
వెలుగు నీడల దారుల్లో....
సోషల్ మీడియాతో యువతరాన్ని విడదీసి చూడలేని కాలం ఇది. ‘డిజిటల్ నెటిజన్స్’గా పేరున్న యువతరానికి సోషల్ మీడియాకు సంబంధించి ఎలాంటి ఆసక్తులు ఉన్నాయి? కంటెంట్ క్రియేషన్‌ను ఇష్టపడుతున్నారా? ‘వ్యూయర్’గా ఉండడానికి ఇష్టపడుతున్నారా? బలం తెచ్చుకుంటున్నారా? బలహీనపడుతున్నారా?సోషల్ మీడియా అనేది యువత దైనందిన జీవితంలో విడదీయరాని భాగం అయింది. ‘మా పిల్లలు సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్నారు’ అంటున్న తల్లిదండ్రుల సంఖ్య తక్కువేమీ లేదు.‘సోషల్ మీడియాలో ఎంత టైమ్ గడుపుతున్నారు?’ అనేది ఒక కోణం అయితే అసలు అక్కడ ఏం చేస్తున్నారు? అనేది మరో కోణం. ఈ అంశంపై కొన్ని డిజిటల్ మార్కెటింగ్ పాట్‌ఫామ్స్ సర్వే నిర్వహించాయి.తమ సొంత కంటెంట్‌ను పోస్ట్ చేయడం కంటే యువతలో ఎక్కువమంది ఇతరుల పోస్టులను చదవడం, కామెంట్ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. 21 శాతం మాత్రమే కంటెంట్ క్రియేటర్లుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. 79 శాతం మంది ‘వ్యూయర్స్’గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కంటెంట్‌ను పోస్టు చేస్తున్న వారిలో రోజూ పోస్ట్ చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది.పర్సనల్ గ్రోత్, కెరీర్ ఎంపిక... మొదలైన వాటి విషయంలో సోషల్ మీడియాలోని కంటెంట్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు. రకరకాల డొమైన్స్‌లో కొత్తగా వస్తున్న ట్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి మిగిలిన దేశాలతో పోల్చితే మన దేశంలో యువ ‘స్పోర్ట్స్ సూపర్ ఫ్యాన్స్’ ఎక్కువ. ఈ సూపర్ ఫ్యాన్స్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రపంచంలోని ఎన్నో ఆటల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.‘సోషల్ మీడియాను యూత్ ఎలా ఉపయోగించుకుంటుంది?’ అనేదాన్ని పక్కన పెడితే... సోషల్ మీడియా ఎడిక్షన్ విషయంలో ‘ఎవరో చెప్పేవరకు ఎందుకు... మన గురించి మనం తెలుసుకుందాం’ అనే ధోరణి యువతలో పెరుగుతుండడం శుభసూచకం.‘సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత అప్డేట్ అవుతాం’ అనే భ్రమకు దూరంగా జరుగుతున్నారు.‘ప్రతి అంశానికి మంచి, చెడులు ఉంటాయి. మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేదానిపైనే మంచి, చెడు ఆధారపడి ఉంటాయి’ అంటుంది ఎంబీఏ స్టూడెంట్ తాన్వీ అగర్వాల్.ముంబైకి చెందిన తాన్వీ ఒకప్పుడు సోషల్ మీడియానే ప్రపంచంగా ఉండేది. తాను సోషల్ మీడియాకు ఎడిక్ట్ అవుతున్న విషయం గ్రహించాక ‘ఒకరోజులో ఇంత సమయం మాత్రమే’ అని టైమ్ సెట్ చేసుకుంది.‘సోషల్ మీడియాకు ఎడిక్ట్ కావడం వల్ల నా చదువు దెబ్బతింది. చదివే సమయంలో సోషల్ మీడియాలో చదివిన పోస్టులు, చూసిన వీడియోలు గుర్తుకు వస్తుంటాయి. ఆలోచనలు అటువైపు మళ్లుతుంటాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది’ అంటుంది తాన్వీ అగర్వాల్.సోషల్ మీడియాను ఎంతసేపు, ఎలా వాడుకోవాలి అనేది ఒక కోణం అయితే ‘నైతికత’ అనేది మరో కోణం.లక్నోకు చెందిన వైశాలి ఒకప్పుడు మీమ్స్‌ను తెగ ఎంజాయ్ చేసేది. అయితే ‘బ్యాడ్ టేస్ట్ ఇన్ మీమ్స్’ అనే పోస్ట్ చదివిన తరువాత ఆమెలో మార్పు వచ్చింది.ఇప్పుడు ఆమె రిలేటబుల్ కంటెంట్, గుడ్ మీమ్స్‌ను మాత్రమే ఇష్టపడుతుంది.‘మీమ్స్ ద్వారా క్రూరత్వాన్ని ప్రదర్శించవద్దు. మీమ్స్ అనేవి హాయిగా నవ్వుకునేలా ఉండాలి’ అంటుంది వైశాలి.బ్రాండ్ల ఎంపికకు సంబంధించి సోషల్ మీడియాపై ఎక్కువ ఆధారపడుతుంది యువతరం. కాస్తో కూస్తో వచ్చిన మార్పు ఏమిటంటే ఇప్పుడు బ్రాండ్ల నుంచి జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నారు. ఫలానా బ్రాండ్ పర్యావరణం హితం అంటే ఆ బ్రాండ్ వైపు మొగ్గుచూపుతున్నారు.స్థూలంగా చేప్పాలంటే... ‘సోషల్ మీడియాతో బలం తెచ్చుకుంటున్నామా? బలహీనపడుతున్నామా?’ అనేది పూర్తిగా మన అవగాహన, ఆలోచన ధోరణి మీదే ఆధారపడుతుంది. ఉదాహరణకు... ఫోర్బ్స్ హెల్త్ అండ్ వన్‌పోల్ సర్వే ప్రకారం సోషల్ మీడియాలో 53 శాతం మంది తమ నవ్వును ఇతరులతో ΄ోల్చి చూసుకుంటున్నారు.‘అయ్యో! అలా అందంగా నవ్వలేక పోతున్నానే’ అని అవతలి వ్యక్తితో పోల్చుకొని బాధ పడుతున్న వారే ఎక్కువ.పలువరుస అందంగా కనిపించడానికి సోషల్ మీడియాలోని తమ ఫొటోలను ఎడిట్ చేస్తున్నవారు, పలువరుస బాగోలేదని ఫొటోను హైడ్ చేస్తున్నవారూ ఉన్నారు. ‘నవ్వు విషయంలో నా ఆత్మవిశ్వాసాన్ని సోషల్ మీడియా దెబ్బతిస్తోంది’ అంటున్నారు 45 శాతం మంది.సోషల్ మీడియా అనే ప్రపంచంలో ...చిన్న నవ్వు విషయంలోనూ ఆత్మవిశ్వాసం లోపించిన వారు ఉన్నారు. ప్రయోజనకర కంటెంట్‌తో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో తమను తాము నిరూపించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారు ఉన్నారు. ఏ దారిలో వెళుతున్నామనేది పూర్తిగా మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మార్పు గురించి చెప్పుకోవాల్సి వస్తే... ‘నేను ఏ దారిలో వెళుతున్నాను. ఇది సరిౖయెనదేనా?’ అనే స్వీయ విశ్లేషణ ధోరణి యువతరంలో పెరుగుతోంది. -
అవకాశాలను సృష్టించుకోవాలి!
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆరుషి ఢిల్లీ వాసి. కాలేజీ రోజుల నుంచే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారాఫ్యాషన్ డ్రెస్సులు, జ్యువెలరీ అమ్మకాలు చేపట్టింది. ఏడేళ్ల క్రితం 30 వేల రూపాయతో విష్’ పేరుతో సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసి, విదేశాలకూ తన ఉత్పత్తులను సర ఫరా చేస్తోంది. ;పాతికమందికి పైగా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించింది. దేశంలో గ్రామీణ మహిళా కళాకారులను గుర్తించి, వారితో నెట్వర్కింగ్ ఏర్పాటుచేసి, ఉపాల్పిస్తోంది. ‘అవకాశాలను వెతకడం కాదు, మనమే సృష్టించుకోవాలి’ అంటున్న ఆరుషి నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ‘‘నేను ఫ్యాషన్ డ్రెస్సులు, కస్టమైజ్డ్ జ్యువెలరీ, డెకరేటివ్ వస్తువులు, పిల్లల బట్టలు, ఇతర ఉపకరణాలను ఎగుమతి చేస్తుంటాను. నాకు మొదటి నుంచి బిజినెస్ అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో అమ్మతో కలిసి అనేక ఈ–కామర్స్ సైట్లలో చీరలు, సూట్లు అమ్మేదానిని. కానీ, చాలా పోటీ అనిపించేది. ఏదైనా సరే భిన్నంగా చేయాలనే కోరిక ఉండేది. కానీ, సరైన మార్గం దొరికేది కాదు. కాలేజీలో చదువుతూనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాను. కానీ, నాకు నేనుగా నిరూపించుకునే పనిచేయాలనుకునేదాన్ని. దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని వ్యా΄ారానికి కేటాయించాలనుకున్నాను. ఉద్యోగం ద్వారా సంపాదించిన మొత్తంతో సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాను. 30 వేల రూ΄ాయలతో ‘లావిష్’ అనే పేరుతో కంపెనీని రిజిస్టర్ చేయించాను. అమెజాన్‌తో కలిసి చీరలు, ఫ్యాషన్ జ్యువెలరీ వంటివి అమ్మడం మొదలుపెట్టాను. రెండేళ్లు ఈ పనులు ఇలాగే కొనసాగాయి. అంతర్జాతీయంగా.. అమ్మే ఉత్పత్తులకు నా సొంత ఆలోచనను జోడించాను. సొంతంగా డిజైన్లు చేయడంతో ΄పాటు కొనుగోలుదార్లు అడిగే డిజైన్లపైనా పనిచేయడం మొదలుపెట్టాను. కస్టమైజ్డ్ డిజైన్లు అవడంతో ఆర్డర్లు విరివిగా రావడం మొదలయ్యాయి. దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ కొనుగోలుదార్లు పెరిగారు. పాతికలక్షలకు పైగా టర్నోవర్ సాధిస్తున్నాను. మహిళలు మాత్రమే నా కంపెనీలో మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. దేశంలోని గ్రామాల నుండి కళాకారుల సమాచారం సేకరిస్తాను. వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాను. అక్కడ ఉత్పత్తులను తయారు చేయించి, వాటిని విక్రయిస్తాను. మహిళలు మాతో కనెక్ట్ అవడానికి ప్రత్యేక ప్రయోజనం కూడా ఉంది. తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయనవసరం లేదు. అమ్ముకోవడం కోసం బయటికి వెళ్లనక్కరలేదు. ఇంట్లో కూర్చొని ఉపాధి ΄పోందవచ్చు. అంతేకాదు, వారి నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తుంది. దీనిద్వారా ఎంతోమంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మన హస్తకళలకు ముఖ్యంగా ఆభరణాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. విదేశీ మహిళలకు రాజస్థానీ వస్త్రధారణ, బంజారా నగలు అంటే పిచ్చి. వారు భారతీయ సంస్కృతిని చాలా ఇష్టపడతారు. దీని కారణంగానే వారు భారతీయ డ్రెస్సులు, ఆభరణాలవైపు ఆకర్షితులవుతారు. ఒంటరి తల్లి నా సక్సెస్ వెనక మా అమ్మ మద్దతు చాలా ఉంది. నేను ముందడుగు వేయడంలో అమ్మ ఎప్పుడూ ్రపోత్సహిస్తుంటుంది. మా చెల్లినీ, నన్ను అమ్మ ఒంటరిగా చాలా కష్టపడి పెంచింది. ఆ కష్టంలో... నేను నా మార్గం కనుక్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇచ్చింది. అందుకే ఈ రోజు వరకు 12 దేశాలకు ఒంటరిగా వెళ్లి, సందర్శించగలిగాను. ఇంటి పేరుకు నో! నా పేరుకు ఇంటిపేరు జోడించకూడదని నా సొంత నిర్ణయం. అందుకే, నా పేరుకు ముందు సర్నేమ్ ఉండదు. ఒక వ్యక్తి చేసే పనే వారి గుర్తింపు అవుతుంది. అందుకే, ఇంటి పేరును జత చేసుకోవాల్సిన అవసరం లేదని నేను భావించాను. అందుకు మా అమ్మ కూడా మద్దతు తెలిపింది. కానీ, ముఖ్యమైన పేపర్లలో సర్నేమ్ లేకుండా ఇవ్వలేమనే నిబంధనలతో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్కూల్లో, కాలేజీలో ప్రతిచోటా ఈ సమస్య ఎదురైంది. కానీ, నా నిర్ణయాన్ని మార్చకోలేనని స్పష్టంగా చె΄్పాను. అందుకు, చట్టపరంగానూ, న్యాయసలహాలు తీసుకున్నాను. దీంతో నా సర్టిఫికెట్లన్నింటిలోనూ నా పేరు మాత్రమే ఉంటుంది. ఒంటరి యాత్రికురాలిని నాకు ప్రయాణాలు అంటే ఇష్టం. ప్రకృతి అందమైన ప్రపంచాన్ని మన ముందుంచింది. దానిని ఆస్వాదించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అనుకుంటాను. స్వదేశంలో లేదా విదేశంలో ఎక్కడ సందర్శనకు వెళ్లినా ప్రతిచోటా వారి సంస్కృతి, కళల గురించి తెలుసుకుంటాను. గ్రామాల్లో దాగి ఉన్న సాంస్కృతిక, కళాత్మక ప్రతిభను తెలుసుకొని, నైపుణ్యాలను మెరుగుపరిచి, ప్రపంచం ముందుకు తీసుకువస్తుంటాను’’ అని తన విజయపథాన్ని వివరించింది ఆరుషి. -
బ్రైట్‌కామ్ సీఎండీ, సీఎఫ్‌వోల రాజీనామా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్ సీఎండీ సురేశ్ రెడ్డి, సీఎఫ్‌వో నారాయణ రాజు రాజీనామా చేశారు. ఇరువురి రాజీనామాను ఆమోదించినట్టు కంపెనీ బోర్డు ప్రకటించింది. కొత్త సీఈవో, సీఎఫ్‌వో కోసం అన్వేషణ ప్రారంభించేందుకు సైతం బోర్డు ఓకే చెప్పింది. కాగా, కంపెనీ ఆర్థిక వ్యవహారాలలో అకౌంటింగ్ అక్రమాలు, తప్పుడు స్టేట్మెంట్లను వెల్లడించినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ విచారణలో తేలడంతో.. ఆగస్టు 22న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు ద్వారా సీఎండీ, సీఎఫ్‌వోలను బోర్డు స్థానాల నుండి సెబీ నిషేధించిన సంగతి తెలిసిందే. కంపెనీ తన షేర్ల ప్రాధాన్యత కేటాయింపులకు సంబంధించిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లు కల్పితమని సెబీ కనుగొంది. దీనిని అనుసరించి బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లను విక్రయించకుండా శర్మ, 22 ఇతర సంస్థలను సెబీ నిషేధించింది. -
Theli Rajeshwari: మురికివాడ నుంచి లండన్ వరకు
తేలి రాజేశ్వరిది మెదక్ జిల్లా దప్పూరు. వలస కూలీలుగా తల్లిదండ్రులు ముంబైకి వెళితే అక్కడే పుట్టింది. స్లమ్స్‌లో ఉన్నా మరాఠీ మీడియంలో చదువుకున్నా ఏనాటికైనా పై చదువులకు విదేశాలకు వెళ్లాలని పట్టుదల. దానిని సాధించింది. లండన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న రాజేశ్వరి తన చదువు కొనసాగించడానికి డిజిటల్ మార్కెటింగ్‌లో పని చేస్తోంది. ఆమె ప్రయాణం ఆమె మాటల్లో. ‘నా పేరు రాజేశ్వరి. మాది మెదక్ జిల్లా దప్పూరు. మా అమ్మానాన్నలు వలస కూలీలు. ముంబై వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పని చేసేవారు. ఎక్కడ కడుతుంటే దాని బేస్మెంట్లో పట్టాలు కట్టుకుని కాపురం ఉండేవారు. అంధేరిలో వాళ్లు కూలి పని చేస్తుండగా నేను పుట్టాను. నాకు అప్పటికే అన్న ఉన్నాడు. ఎల్.కె.జి, యు.కె.జి నేను మరాఠి స్కూల్లో చదువుకున్నాక ముంబైలో చదువు కష్టమని నన్ను, అన్నను దప్పూరులోని మా నానమ్మ దగ్గరకు పంపారు. అక్కడ మళ్లీ అఆలు నేర్చుకోవడం నాకు కష్టమైంది. ఐదవ క్లాసు పూర్తయ్యేసరికి మా నానమ్మ చనిపోయింది. ఇక ఊళ్లో ఎవరూ లేరు. మళ్లీ అన్నా, నేను ముంబై చేరుకున్నాం’. ► పనిపిల్లగా ఉంటూ ‘2006లో ముంబైకి వచ్చాక ఆరోక్లాసు నుంచి చదవడానికి తెలుగుమీడియం స్కూల్ దొరకలేదు. మేముండే ములుండ్ నుంచి గంట దూరం వెళ్లి చదువుకుందామన్నా దొరకలేదు. చివరకు దగ్గరిలోని కన్నడ మీడియం స్కూల్లో చేరాల్సి వచ్చింది. నేను ముంబై వచ్చాక బాగా చదువుకోవాలని అనుకున్నాను. దానికి డబ్బు కావాలి. అందుకని నేను స్కూలుకు వెళ్లడంతోపాటు దగ్గరి ఇళ్లల్లో పనిపిల్లగా చేసేదాన్ని. అందుకు నేను కొంచెం కూడా ఇబ్బంది పడలేదు. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. టెన్త్ వరకూ అలాగే చదువుకున్నాను. ఇంటర్‌కి వచ్చేసరికి కాలేజీకి అరాకొరా వెళుతూ టెలీకాలర్‌గా పని చేశాను. దానివల్ల అకౌంట్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఇక పై చదవలేనేమో అనిపించింది. ఎలాగో ఇంటర్ పూర్తి చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగంలో చేరిపోయాను. అంతవరకూ నేను జీవితం గడిపింది స్లమ్స్‌లోనే’ ► మళ్లీ చదువుకు ‘ఇంటర్ అయ్యాక నేను ముంబైలోని ఎక్సెంచర్ సంస్థలో ఒక ఏజెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరాను. ఇంటర్ పాస్ మీద వారిచ్చిన ఉద్యోగం నాకు తృప్తిగా ఉండేది. కాని 2018 వచ్చేసరికి నా ఉద్యోగంలో ఎటువంటి ఎదుగుదల లేదు. డిగ్రీ లేని నీకు ఈ మాత్రం జీతం ఇవ్వడమే గొప్ప అన్నారు సంస్థ వారు. మళ్లీ చదువు గుర్తుకొచ్చింది. ఏమిటి ఇలా తయారయ్యాను అనుకున్నాను. పై చదువులు చదవాలన్న పట్టుదల గుర్తుకొచ్చింది. ఎలాగైనా నా కలను సాధించుకోవాలనుకున్నాను. కాని ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలని అలాంటి ఆప్షన్ కోసం ఎన్ని కాలేజీలు తిరిగినా వీలు కాదన్నారు. కరెస్పాండెన్స్ కోర్సు చేయమన్నారు. చివరకు కల్యాణ్ (ముంబైలోని ఒక ఏరియా) లో సంకల్ప్ కాలేజీ వాళ్లు నా తపన చూసి నీకు వీలున్నప్పుడు వచ్చి అటెండ్ అవుతూ ఉండు అని సీట్ ఇచ్చారు. అక్కడ నేను బికాం చేరాను. నా ఉద్యోగం వారంలో ఐదు రోజులు. ఏ రెండు రోజులైనా ఆఫ్ తీసుకోవచ్చు. అలా నేను అందరిలా శని, ఆదివారం కాకుండా వీక్‌డేస్ ఆఫ్ తీసుకుంటూ 2021 జూన్‌లో బి.కాం పూర్తి చేశాను. ఉద్యోగం చేస్తూ జాగ్రత్తగా పొదుపు చేస్తూ వచ్చాను’ ► యు.కె. కల ‘ఒకవైపు చదువు, ఉద్యోగంతో పాటు విదేశాలలో చదవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో తెలుసుకుంటూ వచ్చాను. పాస్‌పోర్ట్ కోసం నా పర్మినెంట్ అడ్రస్ దప్పూర్ కావడం వల్ల హైదరాబాద్ నుంచే తీసుకోవాల్సి వచ్చింది. దానికోసం ఆధార్ కరెక్షన్, సర్టిఫికెట్లు చాలా పని. మరో వైపు 2022 సెప్టెంబర్ ఇన్‌టేక్ (యూకేలో సెప్టెంబర్‌లో మొదలయ్యే అకడెమిక్ ఇయర్ కోసం) కోసం ఆన్లైన్లో ఆయా యూనివర్సిటీల్లో అప్లికేషన్స్ వేస్తూ వెళ్లాను. కాని యు.కెలో చదవడం చాలా ఖర్చుతో పని. అందుకోసం నేను బ్యాంకులోను, వడ్డీ మీద బయటి వ్యక్తుల దగ్గర లోన్ తీసుకున్నాను. యూకేలో మాస్టర్స్ చేయడానికి నాకు సీట్ వచ్చింది. సెప్టెంబర్ 2022లో లండన్ చేరుకున్నాను. చదువుకుంటూ పార్ట్‌టైమ్ జాబ్ చేయడానికి పరిమిత గంటల అనుమతి ఉంటుంది. కాని అక్కడ వెంటనే పని దొరకదు. సులభంగా దొరికే ఉద్యోగం కేర్‌హోమ్‌లలో పని చేయడమే. మతి స్థిమితం లేనివారు, వృద్ధులు... వీరి బాగోగులు చూసుకుంటే డబ్బులు ఇస్తారు. అలా ఆరు నెలలు పని చేశాను. నాకు డిజిటల్ మార్కెటింగ్‌తో బాగా పరిచయం ఉంది కాబట్టి అందులోనూ సంపాదన వెతుకుతున్నాను. ముంబైలో స్లమ్స్‌లో ఉండిపోవలసిన దాన్ని. నా కష్టమే నన్ను యూకే దాకా చేర్చింది. ఇక్కడకు వచ్చి 9 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు ఈస్టర్ సెలవలు నడుస్తున్నాయి. ఈ సెలవుల్లో ఎక్కువ గంటలు పని చేయవచ్చు. పని చేస్తున్నా. కష్టేఫలి అన్నారు కదా’. -
చదువుకుంటూనే సంపాదించొచ్చు.. నెలకు రూ.15 వేల వరకు
పార్ట్ టైమ్ జాబ్స్.. కొన్నేళ్ల క్రితం వరకు విదేశాలకే పరిమితం. ఉన్నత విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనూ పార్ట్‌టైమ్ కొలువుల కల్చర్ విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, ఈ–కామర్స్ రంగాల విస్తరణ కారణంగా.. విద్యార్థులు చదువుకుంటూనే ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి కొంత ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. పార్ట్‌టైమ్ అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుకునేందుకు మార్గాలు, వేతనాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం.. మన దేశంలో ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్స్ ట్రెండ్ మారుతోంది. గతంలో పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్ అంటే ట్రాన్స్‌లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. కానీ..ప్రస్తుత కార్పొరేట్ యుగంలో..అన్ని రంగాల్లోనూ పార్ట్ టైమ్ ఉద్యోగాల సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సేవల రంగం మొదలు ఐటీ వరకూ.. పార్ట్ టైమ్ జాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. అఫ్లియేట్ మార్కెటింగ్ ఇటీవల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో వినిపిస్తున్న మాట.. అఫ్లియేట్ మార్కెటింగ్. సొంతంగా వెబ్సైట్ రూ΄÷ందించుకున్న వ్యక్తులు.. సదరు పోర్టల్‌లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్ లింక్స్‌ను, ఉత్పత్తులను తమ వెబ్సైట్ వీక్షకులకు కనిపించేలా చేయడమే అఫ్లియేట్ మార్కెటింగ్. ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్సైట్ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్‌గా పేర్కొనొచ్చు. ఈ పద్ధతిలో సంస్థలు సదరు వెబ్సైట్ నుంచి ఎక్స్టర్నల్ లింక్స్‌తో తమ ఉత్పత్తులను వీక్షించిన వారి సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లిస్తున్నాయి. ఈ విధానంలోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి. డెలివరీ అసోసియేట్స్ డెలివరీ అసోసియేట్స్ అంటే.. సంస్థల ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే వారు. ఇవి ఎక్కువగా ఈ–కామర్స్, రిటెయిల్ రంగాల్లో లభిస్తున్నాయి. వీటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతగా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారని క్వికర్జాబ్స్ నివేదిక పేర్కొంది. వీరికి సగటున రూ.15వేలు లభిస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్స్ పార్ట్ టైమ్ ఉపాధి పరంగా మరో చక్కటి అవకాశం..ట్యూటర్స్‌గా పని చేయడం. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో΄ాటు దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం హోంట్యూటర్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్‌కు పప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి వీరు ఆన్లైన్, పార్ట్‌టైమ్ విధానాల్లో నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందడానికి ఇది చక్కటి మార్గం. ప్రస్తుతం ఎన్నో ఎడ్టెక్ స్టార్టప్ సంస్థలు ఆన్లైన్ ట్యాటర్స్కు స్వాగతం పలుకుతున్నాయి. కాపీ రైటర్ పార్ట్ టైమ్ జాబ్స్ విభాగంలో టాప్ లిస్టింగ్‌లో ఉన్న కొలువు.. కాపీ రైటర్. సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్‌లో ఒక సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్‌కు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా రాయడం కాపీ రైటర్ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్లైన్ విధానంలో కాపీ రైటర్స్‌ను నియమించుకుంటున్నాయి. తొలుత ఒక నమూనా కాపీని అడుగుతున్న సంస్థలు..దానికి మెచ్చితే పని చేసే అవకాశం ఇస్తున్నాయి. టైమ్ రేట్, పీస్ రేట్ ప్రతిపదికన రూ.800 నుంచి రూ.వేయి వరకు అందిస్తున్నాయి. డేటాఎంట్రీ టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటే.. ఆదాయం అందించే మరో పార్ట్ టైమ్ అవకాశం.. డేటాఎంట్రీ. బీపీఓ, కేపీఓ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి సేవలు అందించే సంస్థలు తమ క్లయింట్లు పంపించే రికార్డ్లను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్ టైమ్ లేదా ఆన్లైన్ విధానంలో నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. పీస్ రేట్, టైమ్ రేట్ విధానంలో పారితోషికం లభిస్తోంది. పీస్ రేట్ విధానంలో ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్ రేట్ విధానంలో గంటకు రూ.300 నుంచి వేయి వరకు సంపాదించుకునే అవకాశముంది. యాడ్ పోస్టింగ్ ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్మెంట్ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేయడమే..ఆన్లైన్ యాడ్ పోస్టింగ్. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ ఉంటే.. ఈ పార్ట్‌టైమ్ జాబ్‌లో రాణించొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ యాడ్ పోస్టింగ్స్‌కు క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర వెబ్‌సైట్స్ ప్రధాన ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నాయి. ఒక్కో యాడ్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ముందే వీలుంది. ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇది కూడా యువతకు పార్ట్ టైమ్ ఆదాయ వనరుగా నిలుస్తోంది.జిమ్‌లు,ఫిట్నెస్ సెంటర్స్‌లో ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఈ విభాగం సరితూగుతుందని చెప్పచ్చు. పార్ట్ టైమ్ విధానంలో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్‌గా రోజుకు రెండు,మూడు గంటల సమయం వెచ్చిస్తే రూ.500 వరకు సం΄ాదించొచ్చు. సేల్స్ అసోసియేట్ ప్రతి రోజు నిర్దిష్టంగా ఒక సమయంలో.. స్టోర్స్‌లో సేల్స్ విభాగంలో పని చేసే వ్యక్తులనే పార్ట్ టైమ్ సేల్స్ అసోసియేట్స్‌గా పిలుస్తున్నారు. విధుల పరంగా సదరు అవుట్‌లెట్‌లోని స్టాక్ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. ఏ కోర్సు చదువుతున్న వారైనా రిటెయిల్ సేల్స్ అసోసియేట్‌గా పార్ట్ టైమ్‌గా పని చేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించే వీలుంది. క్యాబ్ డ్రైవర్స్ ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మరో పార్ట్ టైమ్ ఆదాయ మార్గం.. క్యాబ్ డ్రైవర్స్‌గా పని చేయడం. ప్రస్తుతం పలు సంస్థలు ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్ ద్వారా సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి రైడర్స్ కొరత ఏర్పడుతోంది. దీంతో పార్ట్ టైమ్ అవకాశాలకు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తోపాటు, పదో తరగతి ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. సోషల్ మీడియా అసిస్టెంట్ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వీసులు, ప్రాడక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ తదితరాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు ఉండాలి. సోషల్ మీడియా రైటింగ్‌పై అవగాహనతోపాటు,ఎస్ఈఓ, ఎస్ఈఎం, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం. వీరు సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందొచ్చు. ఐటీ రంగంలోనూ ఐటీ రంగంలో సైతం పార్ట్ టైమ్ జాబ్స్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రొగగ్రామర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్ కోర్సులు చదువుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న వారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకున్న జాబ్ పప్రొఫైల్,పప్రాజెక్ట్ ఆధారంగా నెలకు రూ.20వేల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఆన్లైన్ కన్సల్టెంట్ ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి..ఆన్లైన్ కన్సల్టెంట్. కంపెనీల్లో ఉన్నత స్థాయి వ్యూహాలు మొదలు ప్రొగ్రామింగ్, కోడింగ్ వరకూ.. ఆన్లైన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. అందుకునే మార్గాలివే ప్రస్తుత టెక్ యుగంలో ఒక్క క్లిక్‌తో వందల ఉద్యోగాల సమాచారం అందించే వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో జాబ్ సెర్చ్ పొర్టల్స్ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే చాలు.. వాటికి సంబంధించిన సమాచారం, నిర్వర్తించాల్సిన విధులు, లభించే పారితోషికం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. పలు మొబైల్ యాప్స్ కూడా పార్ట్‌టైమ్ జాబ్స్ వివరాలు అందిస్తున్నాయి. -
మీడియా మింట్ కొనుగోలు ఒప్పందం రద్దు: బ్రైట్‌కామ్
న్యూఢిల్లీ: మీడియామింట్ సంస్థ కొనుగోలు కోసం కుదుర్చుకున్న ఒప్పందం రద్దయినట్లు డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ సంస్థ బ్రైట్‌కామ్ వెల్లడించింది. దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. ‘కొనుగోలు లావాదేవీ కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య డీల్‌గా మార్చుకోవాలని, బ్రైట్‌కామ్ భవిష్యత్తులో చేపట్టే కొనుగోళ్లకు బ్యాక్ఎండ్ సేవలు అందించాలని ఇరు సంస్థలూ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో 2021 డిసెంబర్ 7న కుదుర్చుకున్న షేర్ల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. మీడియామింట్ ఇటీవల దక్కించుకున్న కొంత మంది క్లయింట్ల కార్యకలాపాలు .. బ్రైట్‌కామ్ ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాపారం కోవకే చెందినవని, దీని వల్ల విలీన సంస్థ వృద్ధి అవకాశాలపై ప్రభావం పడవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. -
డిజిటల్ కొలువుల హబ్‌గా విశాఖ
సాక్షి, అమరావతి: డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇక్కడ కూర్చొని కెనడా, అమెరికా, జపాన్ తదితర దేశాలకు చెందిన ఉత్పత్తులను వారికే విక్రయించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కెనడాలో ఉన్న వ్యక్తి వెబ్‌పేజీలోకి వెళ్లి వారు కోరుకునే వస్తువులను ఇక్కడ నుంచే మార్కెటింగ్ చేయవచ్చు. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు తోడు స్విగ్గీ, జొమాటో, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, పేటీఎం యాప్స్ ద్వారా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో చాలా కంపెనీలు మానవ వనరులు చౌకగా లభించే మన దేశం నుంచే ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. 4జీ టెక్నాలజీతో డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలను విశాఖ నగరం సద్వినియోగం చేసుకుంటోంది. అత్యధికంగా హెల్త్‌కేర్‌లో.. విశాఖ కేంద్రంగా పలు కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా అత్యధికంగా హెల్త్‌కేర్ రంగానికి చెందినవే ఉన్నాయి. విశాఖ కేంద్రంగా పల్సస్ గ్రూపు 2,500 మందికి ఉపాధి కల్పిస్తుండగా డబ్ల్యూఎన్ఎస్, ఏసీఎన్ హెల్త్‌కేర్, ఏజీఎస్ హెల్త్‌కేర్ లాంటి సంస్థలు ఒక్కొక్కటి 1,000 మందికి చొప్పున ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా 15 డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు పని చేస్తుండగా రెండేళ్లలో ఉపాధి పొందే వారి సంఖ్య 15 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కొసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాలు రూ.22,80,000 కోట్ల మేరకు ఉన్నట్లు వివిధ నివేదికలు అంచనా వేస్తుండగా వచ్చే ఐదేళ్లలో ఇది రూ.152 లక్షల కోట్లకు చేరుతుందని పల్సస్ గ్రూపు సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. ఈ అవకాశాల్లో మన రాష్ట్రం కనీసం ఒక్క శాతం వాటాను దక్కించుకున్నా రాష్ట్రంలో వ్యాపార పరిమాణం రూ.1,52,000 కోట్లకు చేరుతుందని తద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. సాగర నగరికి అపార అవకాశాలు విశాఖ డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా ఎదిగేందుకు పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. పుష్కలమైన మానవ వనరుల లభ్యతతో పాటు నాస్కామ్ ఐవోటీ, ఎస్టీపీఐ ఇండస్ట్రీ నాలుగు రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేయడం కలసి వచ్చే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి చెందిన ఐటీ రంగ నిపుణులు 20 లక్షల మంది ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో సేవలు అందిస్తుండగా ఇందులో ఒక శాతం మందిని ఆకర్షించగలిగినా 20,000 మందికి స్థానికంగా ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం నైపుణ్య శిక్షణను అందజేస్తే రెండేళ్లలోనే వేలాది మందికి స్థానికంగానే ఉపాధి దొరుకుతుందని పేర్కొంటున్నారు. మధురవాడలో భారీ క్యాంపస్ విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌లో డిజిటల్ మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నాం. 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ క్యాంపస్ ద్వారా షిఫ్ట్‌కు 7,000 మంది చొప్పున రెండు షిఫ్ట్‌లలో 14,000 మందికి ఉపాధి కల్పించవచ్చు. దీనికి అదనంగా మధురవాడలో 2.5 లక్షల చదరపు అడుగుల్లో మరో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తున్నాం. విజయవాడ, తిరుపతి, అనంతపురంలో డిజిటల్ మార్కెటింగ్ కార్యాలయాలను త్వరలో ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నాం. – గేదెల శ్రీనుబాబు, సీఈవో, పల్సస్ గ్రూప్ ప్రభుత్వ తోడ్పాటుతో భారీ అవకాశాలు.. డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, సెర్చింగ్ ఆప్టిమైజ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవారు స్థానికంగా అందుబాటులో లేరు. ప్రభుత్వం చొరవ తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ రంగానికి చెందిన మానవ వనరులను అందుబాటులోకి తెస్తే స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – శ్రీధర్ కొసరాజు, ప్రెసిడెంట్, ఐటాప్ -
ఎగుమతి.. జిల్లాలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలను అంతర్జాతీయ ఎగుమతి హబ్‌లుగా కేంద్రం గుర్తించింది. కేవలం కేంద్ర, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ పలు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు వీలుగా ఆయా జిల్లాలను హబ్‌లుగా గుర్తించింది. గతంలో ఎగుమతుల వ్యవహారం మొత్తం కేంద్రమే పర్యవేక్షించేది. తాజాగా జిల్లా స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ హబ్‌లను గుర్తించారు. జిల్లాలు స్వయం సమృద్ధి, స్వావలంబన దిశగా ముందుకు సాగేలా ఈ ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఈ మేరకు తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతికి అవసరమైన నాణ్యత కలిగి ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వ్యవసాయశాఖ అందించిన వివరాల ఆధారంగా ఎగుమతులకు అవకాశమున్న వ్యవసాయ ఉత్పత్తులను జిల్లాల వారీగా గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అంతర్జాతీయ నాణ్యతతో పండించాలి ఆయా ఉత్పత్తులను స్థానిక ఎగుమతిదారులు లేదా తయారీదారులు తగినంత పరిమాణంలో, అంతర్జాతీయ నాణ్యతతో పండించేలా చూడాలి. అందుకు అవసరమైన నిర్దిష్ట చర్యలు చేపట్టాలి. అంతేకాదు విదేశీ కొనుగోలుదారులకు అనుగుణంగా మార్కెట్ చేయాలి. ఆ మేరకు జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కొన్నిచోట్ల ఇప్పటికే ఏర్పాటయ్యాయి. కాగా ప్రతి జిల్లాలో సంబంధిత ఉత్పత్తులను ఎగుమతి చేసే వారందరి డేటాబేస్‌ను అభివృద్ధి చేయాలి. విదేశీ మార్కెట్ కొనుగోలుదారులను గుర్తించేందుకు జిల్లాలోని ఎగుమతిదారులకు అవకాశం కల్పించాలి. జిల్లాల్లో గుర్తించిన ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో అడ్డంకులను నివారించాలి. విదేశీ మార్కెట్లకు ఎగుమతి అవకాశాలను పెంచాలి. జిల్లాల నుంచి ఉత్పత్తులు విదేశాలకు చేరుకోవడానికి ఈ–కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ పద్ధతిని అవలంబించాలి. నాణ్యత పరీక్ష (టెస్టింగ్), ధ్రువీకరణ (సర్టిఫికేషన్), ప్యాకేజింగ్, కోల్డ్ చైన్ (సరైన పద్ధతిలో నిల్వ) విధానంలో రవాణా జరుగుతుంది. ప్రస్తుతం చేపట్టబోయే చర్యల వల్ల గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని కేంద్రం భావిస్తోంది. -
నేర్చుకో.. లాభాలు అందుకో
ఈక్విటీలు నూతన గరిష్టాలకు చేరుతుండడం యువ ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పెట్టుబడులపై చక్కని రాబడులు సొంతం చేసుకునే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే నేటి తరానికి ఉన్న అనుకూలత.. డిజిటల్ వేదికలపై సమాచారం పుష్కలంగా లభిస్తుండడం. లెర్నింగ్ యాప్‌ల సాయంతో ఈక్విటీలపై మరింత అవగాహన పెంచుకునేందుకు టెక్కీ యువత ఆసక్తి చూపిస్తోంది. జెరోదా పెట్టుబడుల మద్దతు కలిగిన ‘లెర్న్‌యాప్’కు యూజర్ల సంఖ్య ఏడాదిలోనే మూడింతలు పెరిగింది. 2020లో యూజర్ల సంఖ్య 70,000 కాగా, ఈ సంఖ్య ప్రస్తుతం 2,00,000 దాటిపోయింది. అంతేకాదు 10 లక్షల మంది ఇతరులు ఈ యాప్‌పై సమాచారాన్ని ఆన్వేషిస్తున్నారు. స్టాక్స్, క్రిప్టోలకు సంబంధించిన పాఠాలు ఇందులో వీడియోల రూపంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. 50 లక్షల మంది యూజర్లకు చేరువ కావాలన్నది లెర్న్‌యాప్ లక్ష్యం. ‘‘2020 నుంచి మా ఆదాయంలో 300 శాతం వృద్ధి కనిపిస్తోంది. గతేడాది ఆదాయంతో పోలిస్తే 2021లో ఆదాయం 350 అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని లెర్న్‌యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రతీక్‌సింగ్ తెలిపారు. డాక్యుమెంటరీ రూపంలోని వీడియోలు, క్విజ్‌లతో ఇందులోని సమాచారాన్ని మరింత ఆసక్తికంగా మార్చే ప్రయత్నాలను లెర్న్‌యాప్ అమలు చేస్తోంది. సాధారణంగా ఆర్థిక అంశాల పట్ల ఎక్కువ మందిలో ఆసక్తి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా రూపొందించడంపై ఈ సంస్థ దృష్టి పెట్టడం గమనార్హం. మహిళలకు ప్రత్యేకంగా.. పట్టణ మహిళల కోసం ఉద్దేశించినది ‘బేసిస్’ యాప్. క్రిప్టోలు, పెట్టుబడులపై ఈ యాప్‌లో ఆసక్తికర చర్చలు కూడా సాగుతుంటాయి. మార్కెట్లకు సంబంధించి తమ ఐడియాలను యూజర్లు ఇతరులతో పంచుకుంటుంటారు. 2019లో బేసి స్ మొదలు కాగా.. ఈ ప్లాట్‌ఫామ్‌పై మహిళా యూజర్ల సంఖ్య లక్ష దాటిపోయింది. వీరిలో ఎక్కువ మంది మిలీనియల్స్ కావడం గమనార్హం. కాలేజీ విద్యార్థినులు కూడా ఇందులో యూజర్లుగా ఉన్నారు. పెట్టుబడులను మెరుగ్గా నిర్వహించే విషయంలో నేర్చుకోవాలన్న ఆకాంక్ష వీరి లో వ్యక్తం కావడం భవిష్యత్తు పట్ల వారు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నారో తెలుస్తోంది. ‘‘సభ్యు లు మా ప్లాట్ఫామ్లో చేరిన తర్వాత తమ ఆదాయంలో సగటున 40 శాతం మేర ఆదా చేయగలుగుతున్నారు’’ అని బేసిస్ సహ వ్యవస్థాపకురాలు దీపికా జైకిషన్ తెలిపారు. నిపుణుల సాయంతో తమ ఖర్చులను క్రమబదీ్ధకరించుకోవడం వల్లే ఇది సాధ్యమవుతున్నట్టు చెప్పారు. ఈ యాప్‌లో సభ్యత్వానికి వార్షిక చందా రూ.9,000. ‘ఫైనాన్స్’కు సంబంధించి ఎన్నో ఆరి్టకల్స్ ఈ యాప్‌పై అందుబాటులో ఉన్నాయి. ‘‘ఫైనాన్స్’ గురించి సౌకర్యవంతంగా నేర్చుకునేందుకు మహిళలకు ఒక సురక్షితమైన వేదికను ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’’ అని జైకిషన్ వెల్లడించారు. సొంత సామర్థ్యాలపై ఆసక్తి నేటి తరానికి తాము స్వయంగా ఆర్థిక అంశాలను తెలుసుకుని, తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోవాలన్న ఆసక్తి పెరుగుతున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాదారులపై ఆధారపడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. లెర్న్యాప్ను బెంగళూరు, పుణె, ముంబై తదితర పట్టణాల నుంచి ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు వినియోగిస్తున్నారు. ప్రాంతీయ మార్కెట్లకూ చేరువ కావాలని, హిందీతోపాటు కనీసం రెండు భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందించాలన్న ప్రణాళికతో ఉన్నట్టు ప్రతీక్‌సింగ్ తెలిపారు. ప్రతీ నెలా రూ.375 చందా చెల్లించడం ద్వారా లెర్న్‌యాప్‌పై ఎన్ని కోర్స్‌లను అయినా నేర్చుకోవచ్చు. యూజర్ల విచారణలకు నిపుణులతో జవాబులను కూడా ఇప్పిస్తోంది. నాణ్యతపై దృష్టి.. ఆన్లైన్లో ఎన్నో వేదికలపై ఫైనాన్స్‌కు సంబంధించి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ, నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో లెర్న్‌యాప్, బేసిస్ పనిచేస్తున్నాయి. లెర్న్‌యాప్‌పై పరిశ్రమలకు చెందిన నిపుణులు, దిగ్గజాలు చెప్పిన అనుభవ పాఠాలు అందుబాటులో ఉంటాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ రామ్‌దియో అగర్వాల్, బీఎస్ఈ సీఈవో ఆశిష్ చౌహాన్, ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో రాధికా గుప్తా, రాకేశ్ జున్‌జున్‌వాలాకు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ సీఈవో ఉత్పల్సేత్ తదితరులు చెప్పిన అంశాలతో వీడియోలో ఈ వేదికపై ఉన్నాయి. ‘‘పరిశ్రమలకు చెందిన దిగ్గజ నిపుణులు పాఠాలు చెప్పడం సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే. అంతేకానీ, యూజర్ల నుంచి డబ్బులు సంపాదించుకోవాలని కాదు’’ అని ప్రతీక్‌సింగ్ తెలిపారు. లెర్న్‌యాప్ స్టోరీ రూపంలో వీడియోలను రూపొందిస్తోంది. తద్వారా ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి రోజూ 45 నిమిషాల వర్క్‌షాప్‌ను, అనంతరం ప్రశ్న/జవాబుల సెషన్‌ను నిర్వహిస్తోంది. దీంతో తాము నేర్చుకున్న అంశాలపై వారిలో మరింత అవగాహన ఏర్పడే దిశగా పనిచేస్తోంది. ‘‘మేము ప్రత్యక్ష ఫలితాలను కూడా అందిస్తున్నాం. ఈ రోజు నేర్చుకుని.. పెట్టుబడులు వృద్ధి చెందేందుకు 20 ఏళ్లు వేచి చూసే విధంగా ఇది ఉండదు’’ అని ప్రతీస్ సింగ్ చెప్పడం గమనార్హం. -
Digital Loan: రంగంలోకి టెక్ కంపెనీలు
India Digital Loan Market: కరోనా టైం నుంచి దేశంలో ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో ఇండియా డిజిటల్ పేమెంట్స్ మార్కెట్‌పై టెక్ కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. సుమారు ఒక ట్రిలియన్ డాలర్లతో డిజిటల్ లోన్ మార్కెట్‌ను విస్తరించాలని ప్రణాళిక వేసుకుంటున్నాయి. ఫేస్బుక్, షావోమీ, అమెజాన్, గూగుల్.. టెక దిగ్గజాలు ఇప్పుడు భారత దేశంలోని డిజిటల్ లోన్ మార్కెట్ మీద కన్నేశాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. షావోమి ఇండియా హెడ్ మనూ జైన్ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. లోన్లు, క్రెడిట్ కార్డులు, ఇన్సూరెన్స్ ప్రొడక్టులు ఇందుకోసం దేశంలోని రుణదాతల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించారాయన. ఇది వరకే చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ఫేస్బుక్ ముందుకు వచ్చింది. స్టార్టప్‌లు చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్మాల్ బిజినెస్ లోన్ పేరుతో గతేడాది 100 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్‌లో ఉన్న సంస్థలకు సాయం చేయాలని నిర్ణయించింది. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే ప్రక్రియలో తలమునకలైంది. గూగుల్ కూడా చిన్నస్థాయి రుణదాతలతో ఒప్పందాలు ఇదివరకే చేసుకుంది. గూగుల్ పే ద్వారా డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ నిర్వాహణను ప్రారంభించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ కూడా ఆన్లైన్ రుణదాతల్ని రెగ్యులేట్ చేయాలనే ఆలోచనలో ఉంది. చదవండి: డిపాజిటర్లకు మరింత రక్షణ -
మైక్రోసాఫ్ట్ బంపర్ ఆఫర్.. మహిళలకు కోచింగ్, జాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఎస్ఏపీ ఇండియా, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. టెక్‌సాక్షం పేరుతో 62,000 మందికి ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ అంశాల్లో ఈ శిక్షణ ఉంటుంది. నిపుణులైన 1,000 మందికి ఉద్యోగావకాశాలు, ఇంటర్న్షిప్స్, చిన్న వ్యాపార అవకాశాలు కల్పిస్తారు. రాష్ట్రాల విద్యాశాఖలు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సాయంతో 1,500 మంది టీచర్లకు సైతం శిక్షణ ఇస్తారు. -
Prarthana Jagan: ప్రార్థన బ్యూటిఫుల్ జర్నీ
ఆమె చర్మం అక్కడక్కడ తెల్లగా మారింది.. అందరూ ఆమెను ఎగతాళి చేశారు.. ఆరెంజ్ ఫేస్ అంటూ వెక్కిరించారు.. ఎన్నో నిద్రలేని సంవత్సరాలు గడిపిందామె అయితేనేం.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఇంజినీరింగ్ పూర్తి చేసి, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటెజిస్టు స్థాయికి ఎదిగిన ఆమె కథనం. ‘ఒక యుక్తవయస్కురాలిగా నేను నా ముఖాన్ని ద్వేషించాను’ అంటున్నారు బెంగళూరుకి చెందిన ప్రముఖ మోడల్ ప్రార్థన ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ. 22 సంవత్సరాల ప్రార్థన స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ‘ఆరెంజ్ ఫేస్’ అంటూ తన ముఖం మీద నీళ్లు పోసి, రంగు పోయిందా లేదా అంటూ, తనను ఎగతాళి చేయటం ఇప్పటికీ మర్చిపోలేదు. చిన్నప్పుడు ముఖం మీద ఒక తెల్లమచ్చ కనిపించింది. ఆ తర్వాత ముక్కు వరకు మచ్చలు పెరిగాయి. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ఆ డాక్టర్, ‘ఎండలో నిలబడితే అవే తగ్గిపోతాయి’ అన్నారు. ‘‘అయితే ఎండలో నిలబడిన దగ్గర నుంచి మచ్చలు ముఖమంతా వ్యాపించాయి. ‘బాగా దట్టంగా మేకప్ వేసుకుంటే మచ్చలు కనిపించవు’ అని కొందరు సలహా ఇచ్చారు. దాంతో తనను అందరూ గుర్తించాలనే ఉద్దేశంతో ముఖానికి పౌడర్, కాంపాక్ట్ వంటివి పూసుకునేది. రోజూ ఇందుకోసం సుమారు అరగంట సమయం కేటాయించ వలసి వచ్చేది. రానురాను వాస్తవంలోకి వచ్చి, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలనుకుంది. ‘‘నా చర్మాన్ని కప్పుకోవటానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. పక్కనే ఉన్న కిరాణా షాపుకి వెళ్లాలన్నా కూడా ముఖానికి మేకప్ వేసుకునేదాన్ని. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ముఖం కప్పుకుని, తెల్లవారకుండానే లేచి, ముఖం కనపడకుండా ఉందో లేదో చూసుకునేదాన్ని’’ అంటుంది ప్రార్థన. స్నేహితులంతా జాంబీ ఫేస్ అనేవారు. బాగా దగ్గరగా ఉన్నవారు కూడా ‘ముసలి’ అని గేలి చేసేవారు. అన్నిటినీ భరిస్తూ, లేజర్ థెరపీ చేయించుకుంది. ఈ చికిత్స వల్ల చర్మం కాలి, ఎర్రటి మచ్చలు పడతాయి. ఒకసారి చేసిన చికిత్స వల్ల ముఖమంతా కాలినట్లయిపోయింది. సుమారు ఎనిమిది సంవత్సరాల తరవాత సర్జరీ చేస్తున్న సమయంలో జరిగిన ఒక సంఘటన కారణంగా హాస్పిటల్లో మరిన్ని ఎక్కువ రోజులు ఉండవలసి వచ్చింది. అప్పుడు మేకప్ లేకుండా ఉంది ప్రార్థన. ‘‘నన్ను ఎవ్వరూ వింతగా చూడలేదు, ఎవ్వరూ ఎగతాళి చేయలేదు. చాలాకాలం తరవాత నా మనసు ప్రశాంతంగా ఉంది. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయం గురించి ఆలోచించటం మానేశాను. నా ఆరోగ్యం మీద, నా చర్మం మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాను’’ చెప్పుకొచ్చింది ప్రార్థన. 2016లో ప్రార్థన తన చర్మాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ముఖాన్ని బాధించే, ఖర్చుతో కూడిన సర్జరీలకు నో చెప్పేసింది. మోడలింగ్ చేయటం ప్రారంభించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, తనను సపోర్ట్ చేయమని కోరింది. ఇప్పుడు ప్రార్థన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటెజిస్ట్ కావడమే కాదు, ఇంజినీరింగ్‌లో డిగ్రీ కూడా సాధించింది. తరవాత ప్రార్థనలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. తన మొట్టమొదటి వీడియోను యూ ట్యూట్లో అప్లోడ్ చేసింది. బొల్లి గురించి తన చానెల్లో మాట్లాడింది. ఆ తరవాత ఇన్స్టాగ్రామ్ ద్వారా తన మనసులోని భావాలను నేరుగా పంచుకుంది. తన ఫొటోలను చూపిస్తూ, బొల్లి గురించి అందరికీ అవగాహన కల్పించటం ప్రారంభించింది. ఆమె లాగే అటువంటి బాధలు పడిన చాలామంది తమ భావాలను కూడా పంచుకోవటం ప్రారంభించారు. ‘‘మాలో ఆత్మవిశ్వాసం కలిగించారు’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తనను నిత్యం ప్రోత్సహిస్తూ, తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన తల్లిదండ్రులకు, స్నేహితులకు ప్రార్థన కృజ్ఞతలు చెబుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ వ్యాధితో ఉన్నవారిలో ఉత్సాహం పెరిగేలా పోస్టులు పెడుతోంది. ‘ప్రార్థనలోని ధైర్యాన్ని అభినందించాలి..’ అంటోంది సోషల్ మీడియా. -
బ్రాండ్ మీది.. ప్రమోషన్ మాది
సాక్షి, హైదరాబాద్: వ్యాపారం, ప్రొడక్ట్స్, సంస్థలు, స్టార్టప్ కంపెనీలు, సరికొత్త డిజైన్స్ ఇలా ఏదైనా సరే మార్కెట్లో ఓ ‘బ్రాండ్ ’గా స్థిరపడాలనుకుంటాయి.. దానికి నాణ్యత, ట్రెండ్‌ని సెట్ చేసే లక్షణాలు ఉంటే సరిపోదు. అది జనాలకు చేరాలి.. మెరుగైన ప్రచారం కల్పించాలి. దానికి అనువైన మార్గం డిజిటల్ మార్కెటింగ్. అయితే ఒకప్పుడు నగరంలో బ్రాండ్ ప్రమోషన్‌కి బెంగళూర్, నోయిడా తదితర ప్రాంతాలకు చెందిన ఆన్లైన్ ప్రమోటర్స్‌ని ఆశ్రయించేవారు. ప్రస్తుతం నగరవాసులు కూడా సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్‌లో రాణిస్తున్నారు. అందులో భాగంగా బ్రాండ్ ప్రమోషన్లో కొత్త ట్రెండ్స్ సెట్ చేస్తూ ముందుకు వెళ్తోంది ‘వీ ఆర్ వెరీ.ఇన్’.. టెక్నాలజీ పెరిగాక ప్రచార మాద్యమాలు కూడా కొత్త పుంతలు తొక్కాయి. ప్రస్తుతం షాపింగ్ మొదలు చదువుల వరకు అన్నీ ఆన్లైన్ పరమయ్యాయి. కొత్త డిజైన్ వేర్స్ నుంచి వస్తువుల నాణ్యత వరకు ఆన్లైన్లోనే వెతుకుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు, కొత్త స్టార్టప్‌లు, ఫ్యాషన్, విద్య, వైద్యం, వినోదం.. అందరూ బ్రాండ్ మార్కెటింగ్‌కి జై అంటున్నారు. దీని కోసం నగరంలో కొన్ని సంవత్సరాలుగా వేలకు పైగా ప్రమోటర్స్ పుట్టుకొచ్చారు. ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా వీరిదే హవా అంతా.. యాడ్స్, అడ్వర్టైజ్మెంట్, సోషల్‌మీడియా ప్రమోషన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఎన్నో మార్గాల ద్వారా బ్రాండ్లను పాపులర్ చేస్తుంటారు. ఈ రంగంలో రాణించాలంటే అన్ని రకాల సామాజిక, సాంకేతిక మూలాలపై అవగాహన, కాలానుగుణమైన హంగులను అలవర్చుకునే నేర్పు అతి ముఖ్యం. దీని ఆవశ్యకత తెలుసుకున్నాక నగరవాసులు కూడా ఈ మాద్యమంపై ఆసక్తి చూపిస్తున్నారు. వీ ఆర్ క్రియేటివ్.. ఈ క్రమంలో నగరానికి చెందిన సాయి బత్తిన, చైతన్య కొదుమూరి అనే యువకులు వినూత్న ఆలోచనలతో ‘వి ఆర్ వెరీ.ఇన్’ బ్రాండింగ్ ప్రమోషన్ ప్రారంభించారు. మొదలుపెట్టిన అతితక్కువ కాలానికే మార్కెట్లో వీరి ఐడియాలజీకి మంచి మార్కులు పడుతున్నాయి. ప్రమోషన్ విధానంలోని నూతన పంథా, ఈ–మెయిల్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సోషల్‌మీడియా యాప్స్‌లలో క్రియేటివ్ ప్రమోషన్స్‌తో బ్రాండ్‌గా మారాలనుకునే వారిని ఆకర్శిస్తున్నారు. ఇప్పటి వరకు లెనిన్ హౌస్, ఫ్లై యువర్ డ్రీమ్స్, నవ అగ్రీటెక్లాంటి వాటికి బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తూనే కొత్త స్టార్టప్‌లకు, పొలిటికల్, సెలబ్రిటీల పాపులారిటీ పెంచే ప్రమోషన్లకి, వెబ్ డిజైనింగ్‌కి పని చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్, వ్యాపారం, హెల్త్ సర్వీసెస్, అబ్రాడ్ ఎడ్యుకేషన్, సామాజిక అవగాహన, ఫొటోగ్రఫీ, సామాజిక సేవ ఇలా విభిన్న రంగాలపై బ్రాండ్ ప్రమోషన్ చేయడం వీరి ప్రత్యేకత. కొత్త తరహాలో రాజకీయ నాయకులకు కూడా వ్యక్తిగత బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో సాయి బత్తిన, చైతన్య కొదుమూరితో పాటు మరికొందరు మిత్రులు 30 మంది ఫ్రీలాన్సర్లు పని చేస్తున్నారు. ‘సోషల్’ సేవ.. ‘విఆర్ వెరీ.ఇన్’ బ్రాండ్ ప్రమోషన్‌తో పాటు సామాజిక సేవనూ ప్రోత్సహిస్తున్నారు. ప్రాడక్ట్ సేల్స్‌పై వచ్చే నికర లాభంలో కొంత సామాజిక సేవకు కేటాయించేలా కంపెనీలను ఒప్పించి వారి నాణ్యత, మన్నిక తదితర అంశాలతో పాటు ఈ విషయానికి ప్రమోషన్స్‌లో ప్రాధాన్యం ఇవ్వడంతో సేల్స్ పెరగడమేకాకుండా సామాజిక సేవకూ వారధులుగా నిలుస్తున్నారు. ఓ ’చిరిగిన చొక్కానైనా వేసుకో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో‘ అనే నానుడి ఆధారంగా ’ఓ మంచి చొక్కా కొనుక్కో.. ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వు‘ అంటూ ఓ క్లాతింగ్ బ్రాండ్‌కి వినూత్నంగా ప్రమోషన్ చేశారు. ఆ బ్రాండ్ వస్త్రాల లాభం నుంచి నిరుపేద బాలలకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. స్వతాహా వీరిరువురు మంచి రైటర్స్ కావడంతో విఆర్ వెరీ.ఇన్ పేజ్ ద్వారా సామాజిక అంశాలపై అవగాహన పెంచేలా ఆర్టికల్స్ షేర్ చేస్తుంటారు. మహిళల రక్షణ, ఆరోగ్యం, సామాజిక సమస్యలకు చెందిన అంశాలపై తమ ఆర్టికల్స్‌తో అవేర్నెస్ పెంచుతున్నారు. అంతేకాకుండా వీరి పేజ్‌కి ఎన్ని లైక్స్, షేర్స్ వస్తే అన్ని రూపాయలను నిరుపేద విద్యార్థుల చదువులకు సహాయంగా అందిస్తున్నారు. సినిమా కోసం వచ్చి.. నిజానికి సాయి బత్తిన, చైతన్య కొదుమూరి సినిమాపై ప్రేమతో వచ్చినవారే.. అక్కడే వీరి స్నేహం చిగురించింది. ఇంకా సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకే షార్ట్ ఫిల్మ్‌లకు కూడా ఓ వేదిక ఉండాలని ప్రైమ్‌షో.ఇన్ ప్రారంభించారు. దీన్ని కూడా ఒటీటీ వేదికలా మార్చి షార్ట్ ఫిల్మ్‌కి ఆసరాగా నిలుస్తున్నారు. వీరికున్న సినిమా పరిచయాలను బ్రాండ్ ప్రమోషన్లో భాగం చేసి వీరి డిజిటల్ మార్కెటింగ్‌ను జనాలకు మరింత చేరువ చేస్తున్నారు. -
డిజిటల్ మార్కెటింగ్ కేరాఫ్ వైజాగ్
సాక్షి, విశాఖపట్నం: రాబోయే రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్‌కు విశాఖపట్నం కేంద్ర బిందువు కానుందని పల్సస్ సీఈవో డా.గేదెల శ్రీనుబాబు అన్నారు. పల్సస్ కార్యాలయంలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు మార్కెటింగ్ అంటే ప్రజలు షాపింగ్ మాల్స్‌కి వెళ్లి చేసేవారనీ.. ట్రెండ్ మారుతున్న తరుణంలో ఎక్కువ మంది డిజిటల్ ప్లాట్‌ఫామ్ యాప్స్‌పైనే ఆధారపడుతున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించనుందన్నారు. డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా సుమారు 50 దేశాల వరకూ విశాఖపట్నం నుంచే సేవలు అందించే రోజులు సమీపంలో ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐటీ, ఐటీఎస్ అవకాశాలను హైదరాబాద్, బెంగళూరు నగరాలు సొంతం చేసుకున్నాయనీ.. మిగిలిన డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలు విశాఖవేనని అన్నారు. సంప్రదాయ మార్కెటింగ్ స్థానంలో దూసుకొస్తున్న డిజిటల్ మార్కెటింగ్ రోజు రోజుకీ ఎదుగుతున్నా.. సమర్థ మానవ వనరుల కొరత మాత్రం ఉందన్నారు. ఆసక్తి, అభిరుచి ఉన్నవారు తగిన నైపుణ్యాల్ని పెంపొందించుకుంటే బోలెడు అవకాశాల్ని అందిపుచ్చుకోవచ్చని సూచించారు. డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, విజువలైజేషన్ కన్సల్టెంట్స్, ఆపరేషన్ అనలిస్ట్, సప్లై చైన్ అనలిస్ట్, రీసెర్చ్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్, డేటా మోడలర్‌తో పాటు విభిన్న రకాల ఉద్యోగాలు ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా రాబోతున్నాయని తెలిపారు. పల్సస్ సాఫ్ట్వేర్ సంస్థ విశాఖలో కేవలం 20 మందితో కార్యకలాపాలు ప్రారంభించిందనీ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండంటంతో సేవలు విస్తరించి... ఇప్పుడు 940 మంది ఉద్యోగులతో కిటకిటలాడుతోందని వివరించారు. నగరం నడిబొడ్డున ఉన్న విప్రో ఎస్ఈజెడ్ క్యాంపస్... పల్సస్ సెంటర్‌గా మారిపోయిందని తెలిపారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోవడంతో త్వరలోనే మరో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహించడంతో ఈ రంగం క్రమంగా పురోగమిస్తోందన్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.100 కోట్ల వరకూ ప్రోత్సాహకాలు విడుదల చెయ్యడంతో చాలా కంపెనీలు ఊపిరి పోసుకున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా సంస్థను విస్తరించనున్నామని తెలిపారు. ఆధునిక వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్న డిజిటల్ మార్కెటింగ్‌లో విశాఖ నగరం ప్రపంచ హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని శ్రీనుబాబు స్పష్టం చేశారు. -
అఫ్లే ఇండియా అప్- ఐనాక్స్ లీజర్ డౌన్
ముందురోజు అమెరికా స్టాక్ ఇండెక్స్ నాస్డాక్ సరికొత్త గరిష్టాన్ని అందుకోవడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడింది. దీంతో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 373 పాయింట్లు జంప్‌చేసి 34,744కు చేరగా.. నిఫ్టీ 112 పాయింట్లు ఎగసి 10,279 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ అఫ్లే ఇండియా కౌంటర్ జోరందుకోగా.. ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఐనాక్స్ లీజర్ అమ్మకాలతో డీలాపడింది. వెరసి అఫ్లే ఇండియా షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. ఐనాక్స్ లీజర్ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం.. అఫ్లే ఇండియా సొంత అనుబంధ సంస్థ ద్వారా సింగపూర్‌లో యాప్నెక్ట్స్ పీటీఈను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించడంతో డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అఫ్లే ఇండియా కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో అఫ్లే ఇండియా షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 1539 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1555ను అధిగమించింది. యాప్నెక్ట్స్ పీటీఈలో 66.67 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు అఫ్లే సింగపూర్ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అఫ్లే ఇండియా పేర్కొంది. మూడేళ్లలోగా యాప్నెక్ట్స్లో మిగిలిన 28.33 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సైతం ఒప్పందం కుదిరినట్లు తెలియజేసింది. ఐనాక్స్ లీజర్ మల్టీప్లెక్స్ కంపెనీ ఐనాక్స్ లీజర్ గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఐనాక్స్ లీజర్ రూ. 82 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 48 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 22 శాతం క్షీణించి రూ. 372 కోట్లకు పరిమితమైంది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఐనాక్స్ లీజర్ షేరు 6 శాతం పతనమై రూ. 266 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 262 వరకూ జారింది. కాగా.. లాక్‌డవున్ ఎత్తివేత అంచనాలతో గత ఐదు రోజుల్లో ఈ షేరు 21 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
డిజిటల్ లక్ష్యంతో శాంసంగ్, ఫేస్బుక్ జట్టు..
ముంబై: దక్షిణకోరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఫేస్‌బుక్‌తో జతకట్టనుంది. మొబైల్ అమ్మకాలను పెంచే వ్యూహంలో భాగంగా రిటైల్ దుకాణాదార్లకు డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో జతకట్టడం వల్ల భారీ స్థాయిలో అమ్మకాల వృద్ధి నమోదవుతుందని కంపెనీ అభిప్రాయపడింది. కరోనా కారణంగా వినియోగదారులు ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారని.. ఆన్లైన్ అమ్మకాలకు ఇది సువర్ణావకశమని శాంసంగ్ కంపెనీ ప్రతినిథులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా రిటైల్ దుకాణాదారులు వృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని ఫేస్బుక్ ప్రతినిథి ప్రశాంత్ జిత్ తెలిపారు. దేశ వ్యాప్త లాక్‌డైన్ కొనసాగుతున్న వేళ ఆన్లైన్ వైపు వినియోగదారులను ఆకర్శించేందుకు సోషల్ మీడియా ఉపయోగపడుతుందని తెలిపారు. ఫేస్బుక్, శాంసంగ్ సమన్వయంతో భారీ స్థాయిలో రిటైల్ దుకాణాదారులు డిజిటల్ వైపు మొగ్గు చూపుతారని శాంసంగ్ ప్రతినిథులు పేర్కొన్నారు. -
ఫార్మాపై యూఎస్ఎఫ్డీఏ ప్రభావం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫార్మా కంపెనీల ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తరచూ తనిఖీలు చేయడం, లోపాలను లేవనెత్తడంతో ఔషధ ఎగుమతుల వృద్ధి తగ్గుతోందని సీఐఐ ఫార్మాస్యూటికల్స్ నేషనల్ కమిటీ చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్ జి.వి.ప్రసాద్ అన్నారు. సీఐఐ–ఐఎంటీహెచ్ సంయుక్తంగా సోమవారం నిర్వహించిన హెల్త్, ఫార్మా సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వార్నింగ్ లెటర్ల కారణంగా చాలా కంపెనీల అనుమతులు నిలిచిపోయాయి. దీంతో కొత్త ఉత్పత్తుల విడుదల ఆగిపోయింది. వీటి నుంచి బయటపడాలంటే యూఎస్ఎఫ్డీఏ ప్రమాణాలకు తగ్గట్టుగా ఇక్కడి కంపెనీలు నాణ్యత, వ్యవస్థ, క్రమశిక్షణ, సమాచార సమగ్రత పాటించాల్సిందే. ఇంకా పాత ప్లాంట్లను కొనసాగిస్తున్న కంపెనీలూ ఉన్నాయి. యాంత్రికీకరణ జరగాలి’ అని వివరించారు. కొత్త అవకాశాలు ఉన్నా.. యూఎస్–చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో భారత ఔషధ కంపెనీలకు పెద్ద ఎత్తున అవకాశాలను తెచ్చిపెడుతోందని ప్రసాద్ వ్యాఖ్యానించారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్, కెమికల్ ఇంటర్మీడియరీస్ సరఫరాలో అంతర్జాతీయంగా చైనా అగ్రస్థానంలో ఉందన్నారు. వీటిని భారత్‌తోపాటు ప్రపంచదేశాలు చైనా నుంచే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అతి తక్కువ ధరకు ముడి సరుకును చైనా సరఫరా చేస్తోందన్నారు. ట్రేడ్ వార్ నేపథ్యంలో పశి్చమ దేశాలు చైనాపై ఆధారపడటం తగ్గించాలని భావిస్తున్నాయని గుర్తుచేశారు. ‘ఇప్పుడు చైనా నూతన ఆవిష్కరణలవైపు దృష్టిసారిస్తోంది. చవక ముడిపదార్థాల సరఫరాదారు అన్న ముద్ర నుంచి బయటపడాలని చూస్తోంది. ఈ అంశమే భారత్‌కు నూతన వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. చైనా ఒక్కటే భారత్‌కు అతి పెద్ద మార్కెట్. భారత కంపెనీలు ముడిపదార్థాల తయారీ పెంచాలి. ఇందుకు తగ్గట్టుగా పెట్టుబడి చేయాలి’ అని వెల్లడించారు. డిజిటల్ మార్కెటింగ్.. ఫార్మా కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ విషయంలో ఇంకా వెనుకంజలో ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. పాత పద్ధతిలోనే మెడికల్ రిప్రజెంటేటివ్స్‌తో ఔషధాలను మార్కెట్ చేస్తున్నాయని అన్నారు. డిజిటల్ మార్కెటింగ్ పెరిగితే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉద్యోగాలు తగ్గినా... కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయ న్నారు. కాగా, ఐఎంటీ రూపొందించిన హెల్త్, ఫార్మా రిపోర్ట్‌ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విడుదల చేశారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్ఎమ్లో భారీ పునర్వ్యస్థీకరణ
హైదరాబాద్: డేటా సెంట్రిక్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసుల దిగ్గజ సంస్థ, గ్రూప్ఎమ్లో ఉన్నత స్థాయిలో భారీ పునర్వ్యస్థీకరణ చోటు చేసుకుంది. గ్రూప్ ఎమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సౌత్ ఏషియా) ప్రశాంత్ కుమార్ నియమితులయ్యారు. ప్రెసిడెంట్ గ్రోత్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌గా (సౌత్ ఏషియా) తుషార్ వ్యాస్ నియమితులయ్యారు. అలాగే గ్రూప్ఎమ్ కంపెనీలో ఒక విభాగమైన మైండ్షేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సౌత్ ఏషియా) పార్థసారధి మాండ్యం, మైండ్ షేర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (సౌత్ ఏషియా) అమిన్ లఖానీ నియమితులయ్యారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త పునర్వ్యస్థీకరణ తమ క్లయింట్ల విజయానికి మరింతగా దోహదపడగలదన్న ధీమాను గ్రూప్ఎమ్ వ్యక్తం చేసింది. సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రశాంత్ కుమార్, తుషార్ వ్యాస్లు విజయవంతమైన ఫలితాలు అందించారని గ్రూప్ఎమ్ సౌత్ ఏషియా సీఈఓ శామ్ సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ఒక రూపాయి బంగారమే ముద్దు
ఒక రూపాయి బంగారం కొనుగోళ్లకే భారతీయ కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారట. పెద్దనోట్ల రద్దులాంటి ఇతర ప్రభుత్వ చర్యలు, బాగా పెరిగిన ధరలు నేపథ్యంలో ప్రపంచంలోని రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉన్న ఇండియాలో డిమాండ్ బాగా క్షీణించింది. 2010లో బంగారానికి అధిక డిమాండ్ నమోదయ్యింది. కానీ గతేడాది బంగారం డిమాండ్ దాదాపు 23శాతం మేర పడిపోయింది. దీంతో నగల దుకాణందారులు ఆన్‌లైన్‌ద్వారా కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ను ఎక్కువగా వినియోగించే యువ కొనుగోలుదారులపై దృష్టిపెట్టారు. దీంతో ఆన్లైన్లో ఒక రూపాయి డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు బాగా పుంజు కున్నాయని డిజిటల్ ప్లాట్‌ఫాం సేఫ్ గోల్డ్ ఎండీ గౌరవ్ మాధుర్ వెల్లడించారు. సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో బంగారం దేశ మొత్తంమీ 524 టన్నుల వినియోగంతో పోలిస్తే డిజిటల్ మార్కెట్ కొనుగోళ్లు ఇంకా స్వల్పంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం సంస్థలు అనుసరిస్తున్న ట్రెండ్‌తో భవిష్యత్తులో డిజిటల్ గోల్డ్‌కు ఆదరణ మరింత పెరగనుందని అంచనా. గత సంవత్సరం ఈ విధానాన్ని ప్రారంభించిన నాటి నుండి దాదాపు 3 మిలియన్ల మంది ఇప్పటికే ప్రపంచ గోల్డ్ కౌన్సిల్లో పెట్టుబడిదారులుగా నమోదయ్యారు. వచ్చే ఏడాది నాటికి 15 మిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 24 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారాన్ని ఒక రూపాయి నుంచి మొదలుకొని ఎంతైనా 'డిజిటల్ గోల్డ్' రూపంలో కొనుగోలు చేసే అవకాశం గత ఏడాదినుంచి అందుబాటులోకి వచ్చింది. ఫోన్‌పే, పేటీఎం, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ ప్లాట్ ఫాంల భాగస్వామ్యంతో సేఫ్గోల్డ్, చైనా అలీబాబాకు చెందిన అగ్మెంట్ ఎంటర్ ప్రైజెస్, దేశీయ డిజిటల్ చెల్లింపుల సేవా సంస్థ పేటీఎంలు ఈ డిజిటల్ గోల్డ్ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. ఈకామర్స్ బిజినెస్ ఎలాం పుంజుకుంటుందో అదే మాదిరిగానే బంగారం కొనుగోళ్లలో కూడా త్వరలోనే డిజిటల్ విప్లవం రానుందని భావిస్తున్నామని అగ్మెంట్ డైరెక్టర్ సచిన్ కొఠారి వ్యాఖ్యానించారు. -
డిజిటల్ మార్కెటింగ్ అడ్డా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం విద్య, వైద్యం, వినోదం ఏ రంగంలోనైనా సరే డిజిటల్ మార్కెటింగ్ ప్రధానంగా మారింది. కంపెనీ అభివృద్ధి, ఉత్పత్తుల ప్రచారంలో ఇతర మాధ్యమాల మార్కెటింగ్ కంటే డిజిటల్ మార్కెటింగ్ ముందున్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే దీన్ని వ్యాపార వేదికగా ఎంచుకుంది ‘డిజిటల్ అకాడమీ 360’. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ యోగేష్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. బెంగళూరులో మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తయ్యాక.. జిఫ్పీ ఎస్ఎంఎస్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా చేరా. మూడేళ్లు పనిచేశాక.. సొంతంగా బల్క్ ఎస్ఎంఎస్ కంపెనీ పెట్టా. ఆ తర్వాత అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని కూడా! ఐదేళ్ల తర్వాత మార్కెటింగ్ రంగంలోని మార్పులు గమనించి.. దీన్నే వ్యాపార వేదికగా మార్చుకోవాలని నిర్ణయించుకొని నవంబర్ 2015లో రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా డిజిటల్ అకాడమీ 360ని ప్రారంభించా. త్వరలోనే 10 రకాల కోర్సులు.. ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్ రెండు రకాల కోర్సులున్నాయి. వీటిల్లో 30కి పైగా సబ్జెక్స్ ఉంటాయి. ధర ఒక్క కోర్సుకు రూ.41 వేలు. ఇప్పటివరకు 20 వేలకు పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. వచ్చే ఏడాది కాలంలో 60 వేల మందికి చేరుకోవాలన్నది లక్ష్యం. ఈ ఏడాది ముగిసే నాటికి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్, యూఐయూఎక్స్, మొబైల్ డెవలప్మెంట్ వంటి 10 రకాల కోర్సులను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం ఆయా సబ్జెక్ట్స్‌లో మెటీరియల్ ప్రిపరేషన్ జరుగుతోంది. ఉద్యోగ అవకాశాల కోసం అమెజాన్, పేటీఎం, యాహూ, కేపీఎంజీ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. 6 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోకి.. ప్రస్తుతం బెంగళూరు, పుణే, మైసూర్, ఢిల్లీ, నోయిడా, చెన్నై నగరాల్లో 21 శిక్షణ కేంద్రాలున్నాయి. 6 నెలల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సెంటర్లను ప్రారంభించనున్నాం. ఆస్ట్రేలియా, దుబాయ్ దేశాల్లోనూ డిజిటల్ అకాడమీ 360 సెంటర్లను ఏర్పాటు చేయనున్నాం. ఆయా దేశాల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. స్థానికంగా ఒకటిరెండు ఫ్రాంచైజీ శిక్షణ సంస్థలతో కలిసి సెంటర్లను ప్రారంభించనున్నాం. మొత్తంగా ఏడాదిన్నరలో 50 సెంటర్లకు చేరుకోవాలన్నది మా లక్ష్యం. ఫ్రాంచైజీ రూ.25 లక్షలు.. స్టడీ మెటీరియల్స్, పరీక్ష పత్రాల తయారీ, శిక్షణ కోసం 60 మంది ట్రైనర్లున్నారు. ఏడాదిలో 200 మందికి చేరుకుంటాం. ప్రతి నగరంలో ఒక్క సెంటర్ మాత్రమే డిజిటల్ అకాడమీ 360ది ఉంటుంది. మిగిలినవి ఫ్రాంచైజీ రూపంలో ఉంటాయి. ఒక్క సెంటర్ ఫ్రాంచైజీ వ్యయం రూ.25 లక్షలు. ఇందులో శిక్షకుల సరఫరా, మార్కెటింగ్, మెటీరియల్ సప్లయి వంటివన్నీ కంపెనీయే చూసుకుంటుంది. ఫ్రాంచైజర్ స్థానికంగా ఉంటూ అకాడమీని నడిపిస్తే చాలు. మొదటి 3 నెలల పాటు రాయల్టీ ఉండదు. ఆ తర్వాత 12 నెలల వరకు నెలకు రూ.50 వేలు ఫీజు ఉంటుంది. ఆ తర్వాత ఆదాయంలో 12–25 శాతం వరకు వాటా ఉంటుంది. రూ.40 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.9 కోట్లు లక్షి్యంచాం. డిజిటల్ అకాడమీ 360 కేంద్ర ప్రభుత్వం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ), గూగుల్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ధ్రువీకరణ పత్రాన్ని పొందింది. ప్రస్తుతం మా కంపెనీలో 80 మంది ఉద్యోగులున్నారు. ఈ డిసెంబర్ ముగింపు నాటికి రూ.40 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి’’ అని యోగేష్ తెలిపారు. -
డిజిటల్ మార్కెటింగ్ పేరుతో టోకరా
హైదరాబాద్ : డిజిటల్ మార్కెటింగ్ పేరుతో పలువురికి టోకరా వేస్తున్న శ్రీకాకుళం వాసిని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బ్యాంకు అకౌంట్ అందించడం ద్వారా ఇతడికి సహకరించిన వ్యక్తిని కటకటాల్లోకి పంపినట్లు డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా తాళ్లవసలకు చెందిన బాలగంగాధర్ గతంలో గూగుల్ కంపెనీలో పని చేశాడు. ఇతడికి డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించిన గూగుల్ యాడ్వర్డ్స్ ఇన్వాయిస్ అకౌంట్‌పై పరిజ్ఞానం ఉంది. డిజిటల్ మార్కెటింగ్ చేయాలని భావించిన వారు ఈ అకౌంట్‌ను ఖరీదు చేయడం ద్వారా ప్రచారం చేసుకుంటారు. ఇలాంటి అకౌంట్స్ అవసరమైన వారి ఫోన్ నెంబర్లు సేకరించిన బాలగంగాధర్ వివిధ పేర్లతో వారికి ఫోన్లు చేసే వాడు. తక్కువ ధకకే గూగుల్ యాడ్వర్డ్స్ ఇన్వాయిస్ అకౌంట్ ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు. అందుకు అంగీకరించిన వారిని అడ్వాన్స్‌గా రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు బ్యాంకు ఖాతాలో వేయని చెప్పేవాడు. తన స్నేహితుడైన బి.భానూజీరావు బ్యాంకు ఖాతాను దీనికి వాడుకుంటూ అతడికి కొంత కమీషన్ చెల్లిస్తున్నాడు. నారాయణగూడకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ ఎ.రాధాకృష్ణను గత నెల్లో సంప్రదించిన గంగాధర్ గూగుల్ యాడ్వర్డ్స్ ఇన్వాయిస్ అకౌంట్ అందిస్తానన్నాడు. ఒక్కో దాని ధర రూ.2 లక్షల వరకు ఉండగా... ఆ రేటుకే మూడు ఇప్పిస్తానంటూ నమ్మించి రూ.లక్ష డిపాజిట్ చేయించుకుని మోసం చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇన్స్పెక్టర్ జి.శంకర్రావు గురువారం బాలగంగాధర్‌తో పాటు భానూజీరావును అరెస్టు చేశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.3.66 లక్షల్ని ఫ్రీజ్ చేశారు. -
అవకాశాల వేదిక.. డిజిటల్ మార్కెటింగ్
కంపెనీలు / సంస్థలు.. తమ ఉత్పత్తులు, సేవల గురించి.. వివిధ ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వినియోగదారులకు తెలియజేయడాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీల దృష్టి డిజిటల్ మార్కెటింగ్‌పై పడింది. ఎలాంటి ఖర్చ్చూ లేకుండా తమ ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకొచ్చే మాధ్యమంగా దీన్ని గుర్తిస్తున్నాయి. దీంతో డిజిటల్ మార్కెటింగ్ అవకాశాల వేదికగా మారుతోంది. ఈ రంగంలో కొన్ని లక్షల మంది మానవ వనరుల అవసరం ఏర్పడనుంది. సిటీలోని పలు ఇన్స్టిట్యూట్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ విభాగంలో ఉద్యోగావకాశాలు, కోర్సులు.. కావాల్సిన స్కిల్స్‌పై ఫోకస్.. డిజిటల్ మార్కెటింగ్ ప్రత్యేకతలు ప్రముఖ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్‌బుక్‌ను వాడేవారి సంఖ్య వంద కోట్ల పైమాటే. అదేవిధంగా ట్విట్టర్‌ను ఉపయోగించేవారి సంఖ్య 274 మిలియన్లు. ఇక వాట్స్‌యాప్‌ను 600 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. సెల్‌ఫోన్ యూజర్లు కోట్లలోనే ఉన్నారు. లింకిడ్ ఇన్, గూగుల్ ప్లస్, నెట్లాగ్, ఇన్స్టాగ్రామ్, మీట్అప్, మీట్మీ వంటివాటిని వాడే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలోనే వివిధ వస్తుత్పత్తి సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, హాస్పిటల్స్, ఆహార పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ సంస్థలు.. మొదలైనవన్నీ తమ వస్తువులు, సేవలను ప్రజలకు పరిచయం చేయడానికి డిజిటల్ మార్కెటింగ్‌పై ఆధారపడుతున్నాయి. ఎలాంటి ఖర్చూ లేకుండా ఉచితంగా సోషల్ మీడియా ద్వారా తమ వస్తువులకు ప్రచారం కల్పిస్తున్నాయి. దీనివల్ల కంపెనీలకు భారీ ఎత్తున ఖర్చు కలిసి వస్తుంది. ప్రైవేటు కంపెనీలే కాకుండా ప్రభుత్వాలు కూడా డిజిటల్ మార్కెటింగ్ ప్రాధాన్యాన్ని గుర్తించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు తాము ప్రవేశపెట్టనున్న పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖలు, ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు కూడా తెరిచాయి. వీటిలో ఉద్యోగాలు డిజిటల్ మార్కెటింగ్‌లో రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మంది నిపుణుల అవసరం ఉంటుందని వివిధ సర్వేలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా కంటెంట్ రైటర్లు, వెబ్ డెవలపర్లు, యానిమేటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, డేటా ఎనలిస్టుల అవసరం భారీగా ఉంది. కంటెంట్ రైటర్.. సంబంధిత కంపెనీ అందించే వస్తువులు, సేవల గురించి వినియోగదారుని ఆకట్టుకునేలా క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా రాయాల్సి ఉంటుంది. వస్తువులు/సేవల ప్రత్యేకతలను వివరించాలి. అవసరమైతే వీడియోలు కూడా పొందుపర్చాలి. వెబ్ డెవలపర్లు.. సంబంధిత కంపెనీ వెబ్‌సైట్‌ను.. యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దాలి. సంబంధిత కంపెనీ ఫేస్బుక్లో ప్రత్యేకంగా పేజీ ఓపెన్ చేస్తే.. అందుకు సంబంధించిన సేవలు అందించాల్సి ఉంటుంది. డేటా ఎనలిస్ట్.. ఎంతమంది ఏయే వెబ్సైట్లను చూస్తున్నారు? తమ వెబ్‌సైట్‌ను చూసేవారెంతమంది? ఏ వస్తువులను వినియోగదారులు ఇష్టపడుతున్నారు? వంటి విషయాలపై డేటా తయారుచేయాలి. ఇవేకాకుండా అఫిలియేట్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ స్ట్రాటజీ, కమ్యూనిటీ మేనేజ్మెంట్, డిజిటల్ అకౌంట్ మేనేజ్మెంట్, డిజిటల్ కాపీ రైటింగ్, డిజిటల్ సీఆర్ఎమ్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ, డిజిటల్ అడ్వర్టైజింగ్ సేల్స్, ఈ-మెయిల్ మార్కెటింగ్, ఈ-కామర్స్, ఇన్‌బౌండ్ మార్కెటింగ్, ఇన్ఫో గ్రాఫిక్స్, మొబైల్యాప్ డెవలప్మెంట్, మొబైల్ కామర్స్, మొబైల్ మార్కెటింగ్, ఆన్లైన్ పబ్లిక్ రిలేషన్స్, పే పెర్క్లిక్ (పీపీసీ), సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్‌మీడియా మార్కెటింగ్, ఎస్ఎమ్ఎస్ మార్కెటింగ్, వెబ్ అనలిటిక్స్, వెబినార్, యూజర్ ఎక్స్పీరియన్స్ వంటి విభాగాల్లో వివిధ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. మన దేశంలో అపార అవకాశాలు ప్రపంచంలో అమెరికా తర్వాత ఎక్కువమంది ఇంటర్నెట్ను వినియోగిస్తోంది మన దేశంలోనే. స్మార్ట్ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. దేశంలో మొబైల్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య 110 మిలియన్లకు పైమాటే. ఇందులో 25 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతం వారే. 2016 నాటికి ప్రపంచంలోనే అత్యధిక ఫేస్బుక్ వినియోగదార్లతో మన దేశం అగ్రస్థానానికి చేరుకోవచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే డిజిటల్ మార్కెటింగ్ అపార అవకాశాల నిలయంగా మారుతోంది. ఆన్లైన్ షాపింగ్, ఎంటర్టైన్మెంట్, సామాజిక చర్చలు, వార్తలు తెలుసుకోవడంలో డిజిటల్ మీడియా ప్రధాన వనరుగా మారింది. కోర్సులు.. సంస్థలు డిజిటల్ మార్కెటింగ్‌లో అడుగుపెట్టాలనుకునేవారు ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు పూర్తిచేయాల్సిన అవసరం లేదు. ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి కంప్యూటర్ బేసిక్స్ తెలిసినవారు ఈ రంగంలో అడుగుపెట్టొచ్చు. ఎంబీఏ మార్కెటింగ్ వంటి కోర్సులు పూర్తిచేస్తే కెరీర్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనదేశంలో డిజిటల్ మార్కెటింగ్ అభివృద్ధి దశలో ఉంది. అందువల్ల ప్రైవేటు రంగంలోని కంప్యూటర్ శిక్షణా సంస్థలు డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలోని ప్రముఖ కంప్యూటర్ శిక్షణ సంస్థ ఎన్ఐఐటీ (వెబ్సైట్: www.niitdigitalmarketing.com/) డిజిటల్ మార్కెటింగ్‌లో వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు), వివిధ ప్రముఖ బిజినెస్ స్కూల్స్ కూడా ఎన్ఐఐటీ సహకారంతో పీజీడీఎం/పీజీపీ కోర్సులో ఒక ఎలక్టివ్‌గా డిజిటల్ మార్కెటింగ్‌ను బోధిస్తున్నాయి. ఇవేకాకుండా డిజిటల్ అకాడమీ ఆఫ్ ఇండియా, డిజిటల్ విద్య, ఎడ్యుకార్ట్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ వంటివి ఈ రంగంలో కోర్సులను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (http://www.isb.edu/) డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్‌పై స్వల్పకాలిక కోర్సును అందిస్తోంది. అదేవిధంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (ఏఐఎస్ఎఫ్ఎం).. మాస్టర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ (అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్)ను ఆఫర్ చేస్తోంది. 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌స డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.aisfm.edu.in/ చూడొచ్చు. సొంతంగా నైపుణ్యాలు పెంచుకోవాలి డిజిటల్ మార్కెటర్లుగా రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలు కీలకం. సరైన ప్రతిభ కనబరచకపోతే కంపెనీలు, క్లయింట్లు, ఎగ్జిక్యూటివ్స్, ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో కొన్ని కళాశాలలు, యూనివర్సిటీలు డిజిటల్ మార్కెటింగ్ కోర్సును కెరీర్‌గా మలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అభ్యర్థులు మార్కెటింగ్‌లో ఎలా విజయం సాధించాలనే దానిపై ప్రత్యేక దృష్టి సారించాయి. కేవలం ఫ్యాకల్టీ సూచనలు, సలహాలపైనే ఆధారపడకుండా సొంతంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. వెబ్ వర్క్స్, హెచ్టీఎమ్ఎల్, పీహెచ్‌పీ, జావా స్క్రిప్ట్, సీఎస్ఎస్, రూబీ లాంటి వాటిపై ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే మార్కెటింగ్ క్యాంపెయిన్లను మరింత సమర్థంగా నిర్వహించవచ్చు. వేతనాలు సెర్స్ హోల్డింగ్ కార్పొరేషన్, ఎన్బీసీ యూనివర్సల్, మైక్రోసాఫ్ట్, డెల్, ఈఎంసీ2, వీఎమ్‌వేర్, ఈబే, గూగుల్, ఏటీ అండ్ టీ, హనీ వెల్ వంటి కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. సంప్రదాయ మార్కెటింగ్ సిబ్బంది వేతనంతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ రంగంలో వారికి వేతనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభంలో నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు పొందొచ్చు. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ. 40,000 నుంచి రూ.80,000 వరకు అందుకోవచ్చు. ఈ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తే రూ.లక్షల్లో ఆర్జించొచ్చు. విస్తరిస్తున్న డిజిటల్ మార్కెటింగ్ ‘‘రానున్న రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ మరింత అభివృద్ధి చెందుతుంది. ఇందులో రాణించాలంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మేనేజర్లకు, కింది స్థాయి సిబ్బందికి మధ్య వారధిగా ఉండాలి. వినియోగదారులను ఆకట్టుకోవడంపైనే ఈ రంగంలో కెరీర్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి వినియోగదారుల ఇష్టాయిష్టాలు, అభిరుచులను ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలుసుకుంటుండాలి. మన దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉంది. వీరంతా సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ రంగం మరింత విస్తరిస్తుంది. తద్వారా అంతేస్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి’’ - గౌతమ్ సాతియా, మార్కెటింగ్ కన్సల్టెంట్ - బ్రాండ్ ప్లానింగ్ అండ్ డిజిటల్ స్ట్రాటజీ, అంత్రాగ్ని డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కావాల్సిన లక్షణాలు కంప్యూటర్ బేసిక్స్ తెలిసుండాలి. ఇంటర్నెట్పై అవగాహన తప్పనిసరి. వివిధ సెర్చ్ ఇంజన్లు, సోషల్ మీడియా వెబ్సైట్లపై పట్టు ఉండాలి. మాతృభాషతోపాటు ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్‌లో వస్తున్న ఆధునిక విధానాల గురించి తెలుసుకోవాలి. వినియోగదారుల అభిరుచులను గమనిస్తుండాలి. సృజనాత్మకతతోపాటు విభిన్నంగా ఆలోచించగలగాలి.