ముంబై: దక్షిణకోరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఫేస్‌బుక్‌తో జతకట్టనుంది. మొబైల్ అమ్మకాలను పెంచే వ్యూహంలో భాగంగా రిటైల్ దుకాణాదార్లకు డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో జతకట్టడం వల్ల భారీ స్థాయిలో అమ్మకాల వృద్ధి నమోదవుతుందని కంపెనీ అభిప్రాయపడింది. కరోనా కారణంగా వినియోగదారులు ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారని.. ఆన్‌లైన్ అమ్మకాలకు ఇది సువర్ణావకశమని శాంసంగ్ కంపెనీ ప్రతినిథులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా రిటైల్ దుకాణాదారులు వృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని ఫేస్‌బుక్ ప్రతినిథి ప్రశాంత్ జిత్ తెలిపారు. దేశ వ్యాప్త లాక్‌డైన్ కొనసాగుతున్న వేళ ఆన్‌లైన్ వైపు వినియోగదారులను ఆకర్శించేందుకు సోషల్ మీడియా ఉపయోగపడుతుందని తెలిపారు. ఫేస్‌బుక్, శాంసంగ్ సమన్వయంతో భారీ స్థాయిలో రిటైల్ దుకాణాదారులు డిజిటల్ వైపు మొగ్గు చూపుతారని శాంసంగ్ ప్రతినిథులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment