ఒక రూపాయి బంగారం కొనుగోళ్లకే భారతీయ కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారట. పెద్దనోట్ల రద్దులాంటి ఇతర ప్రభుత్వ చర్యలు, బాగా పెరిగిన ధరలు నేపథ్యంలో ప్రపంచంలోని రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉన్న ఇండియాలో డిమాండ్ బాగా క్షీణించింది. 2010లో బంగారానికి అధిక డిమాండ్ నమోదయ్యింది. కానీ గతేడాది బంగారం డిమాండ్ దాదాపు 23శాతం మేర పడిపోయింది. దీంతో నగల దుకాణందారులు ఆన్‌లైన్‌ద్వారా కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్‌ను ఎక్కువగా వినియోగించే యువ కొనుగోలుదారులపై దృష్టిపెట్టారు. దీంతో ఆన్‌లైన్‌లో ఒక రూపాయి డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు బాగా పుంజు కున్నాయని డిజిటల్ ప్లాట్‌ఫాం సేఫ్ గోల్డ్ ఎండీ గౌరవ్ మాధుర్ వెల్లడించారు.
సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో బంగారం దేశ మొత్తంమీ 524 టన్నుల వినియోగంతో పోలిస్తే డిజిటల్ మార్కెట్ కొనుగోళ్లు ఇంకా స్వల్పంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం సంస్థలు అనుసరిస్తున్న ట్రెండ్‌తో భవిష్యత్తులో డిజిటల్ గోల్డ్‌కు ఆదరణ మరింత పెరగనుందని అంచనా. గత సంవత్సరం ఈ విధానాన్ని ప్రారంభించిన నాటి నుండి దాదాపు 3 మిలియన్ల మంది ఇప్పటికే ప్రపంచ గోల్డ్ కౌన్సిల్‌లో పెట్టుబడిదారులుగా నమోదయ్యారు. వచ్చే ఏడాది నాటికి 15 మిలియన్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
24 క్యారెట్ల స్వచ్ఛత గల బంగారాన్ని ఒక రూపాయి నుంచి మొదలుకొని ఎంతైనా 'డిజిటల్ గోల్డ్' రూపంలో కొనుగోలు చేసే అవకాశం గత ఏడాదినుంచి అందుబాటులోకి వచ్చింది. ఫోన్‌పే, పేటీఎం, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫాంల భాగస్వామ్యంతో సేఫ్‌గోల్డ్, చైనా అలీబాబాకు చెందిన అగ్‌మెంట్ ఎంటర్ ప్రైజెస్, దేశీయ డిజిటల్ చెల్లింపుల సేవా సంస్థ పేటీఎంలు ఈ డిజిటల్ గోల్డ్ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. ఈకామర్స్ బిజినెస్ ఎలాం పుంజుకుంటుందో అదే మాదిరిగానే బంగారం కొనుగోళ్లలో కూడా త్వరలోనే డిజిటల్ విప్లవం రానుందని భావిస్తున్నామని అగ్‌మెంట్ డైరెక్టర్ సచిన్ కొఠారి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment