Auto Sales In January 2022: దేశీయ ఆటో తయారీ కంపెనీల జనవరి వాహన విక్రయ గణాంకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఈ 2022 ఏడాది తొలి నెలలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ వాహన అమ్మకాలు క్షీణించాయి. అయితే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, నిస్సాన్, స్కోడా అమ్మకాలు మెరుగుపడ్డాయి. ఇదే జనవరిలో ద్విచక్ర వాహన కంపెనీలైన బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ అమ్మకాల్లో రెండెంకల క్షీణత నమోదైంది. మూడోదశ లాక్‌డౌన్ ప్రభావంతో వాణిజ్య వాహనాలకు డిమాండ్ తగ్గింది. ఫలితంగా అశోక్ లేలాండ్, ఎస్కార్ట్స్ అమ్మకాలు తగ్గాయి. సెమికండెక్టర్ల కొరత కొనసాగడంతో వాహన ఉత్పత్తి ఆశించిన స్థాయిలో జరగలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
- మారుతీ సుజుకి ఇండియా జనవరిలో మొత్తం అమ్మకాలు 3.96 శాతం పడిపోయి 1,54,379 యూనిట్లకు చేరింది. గతేడాది 2021 జనవరిలో కంపెనీ 1,60,752 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది.
- ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్27 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జనవరిలో ఈ సంస్థ 59,866 కార్లను అమ్మగా.. ఈ 2022 జనవరిలో 76,210 యూనిట్లను అమ్మింది.
- ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో దేశీయ అమ్మకాలు 15 శాతం క్షీణించాయి. గతేడాది జనవరిలో 4.25 లక్షల వాహనాలను విక్రయించగా.., ఈ ఏడాది తొలి నెలలో 3.63 లక్షల యూనిట్లకు పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment