హురున్ ఇండియా విడుదల చేసిన 2024 దాతృత్వ జాబితాలో.. టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు 'శివ్ నాడార్' రూ. 2153 కోట్లు విరాళమిచ్చి అగ్రగామిగా నిలిచారు. ఆ తరువాత ముకేశ్ అంబానీ, బజాజ్ ఫ్యామిలీ, కుమారమంగళం బిర్లా.. వంటి వారు ఉన్నారు. అయితే ఈ కథనంలో పిన్న వయసులో ఎక్కువ విరాళమిచ్చిన వ్యక్తిని గురించి తెలుసుకుందాం.
38 ఏళ్ల నిఖిల్ కామత్ రెయిన్‌మాటర్ ఫౌండేషన్ ద్వారా వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు రూ. 120 కోట్లను విరాళంగా ఇచ్చినట్లు హురున్ ఇండియా జాబితా ద్వారా తెలిసింది. దీంతో భారతదేశంలో చిన్న వయసులో ఎక్కువ డబ్బును దాతృత్వ కార్యక్రాలకు వెచ్చించిన వ్యక్తిగా నిఖిల్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. రూ. 100 కోట్లకు పైగా విరాళాలు అందించిన వారిలో ఈయన 15వ స్థానంలో నిలిచారు.
ఇదీ చదవండి: ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్
నిఖిల్ కామత్ తరువాత.. జాబితాలో ఎక్కువ విరాళాలు అందించిన ఇతర యువ పరోపకారులలో వివేక్ వకీల్, మాధవకృష్ణ సింఘానియా, సరందర్ సింగ్, వరుణ్ అమర్ వాకిల్, రాఘవపత్ సింఘానియా కూడా వున్నారు. అయితే నిఖిల్ కామత్ ఈ జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. యువ వ్యాపారవేత్తలు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం.
Comments
Please login to add a commentAdd a comment