Philanthropic
-
అభినవ ‘టాటా’! సంపదలో భారీ మొత్తం విరాళం
న్యూఢిల్లీ: టాటాల బాటలోనే రియల్టీ దిగ్గజం అభిషేక్ లోధా, ఆయన కుటుంబం దాతృత్వ కార్యక్రమాల కోసం భారీ స్థాయిలో విరాళమిచ్చింది. లిస్టెడ్ సంస్థ మ్యాక్రోటెక్ డెవలపర్స్‌లో 18 శాతం వాటాకు సరిసమానమైన షేర్లను లాభాపేక్షరహిత సంస్థ లోధా ఫిలాంత్రొపీ ఫౌండేషన్‌కు (ఎల్పీఎఫ్) బదలాయించింది.శుక్రవారం షేరు ముగింపు ధర రూ. 1,175.75 ప్రకారం వీటి విలువ రూ. 21,000 కోట్ల పైగా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం 2013లో ప్రారంభించిన ఎల్పీఎఫ్ .. జాతీయ, సామాజిక ప్రయోజన కార్యక్రమాలపై పని చేస్తోంది. విరాళంగా లభించిన షేర్లపై వచ్చే రాబడిన ఎల్పీఎఫ్.. విద్య, మహిళా సాధికారత తదితర సామాజిక సేవా కార్యక్రమాల కోసం వెచ్చించనుంది.టాటాల బాటలోనే తమ సంపదలో గణనీయమైన భాగాన్ని సమాజ ప్రయోజన కార్యక్రమాల కోసం కేటాయించాలని కుటుంబం నిర్ణయం తీసుకున్నట్లు అభిషేక్ లోధా గతంలో వెల్లడించారు. ‘వందేళ్ల క్రితం టాటా కుటుంబం గ్రూప్ సంస్థల్లోని షేర్‌హోల్డింగ్‌లో సింహభాగాన్ని టాటా ట్రస్ట్స్‌కి బదలాయించింది. దేశానికి ప్రయోజనం చేకూర్చేలా ఈ బహుమతి గణనీయంగా ప్రభావం చూపడం, టాటా ట్రస్ట్స్ చేపట్టిన అనేక మంచి పనులు నాకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని పేర్కొన్నారు. -
38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?
హురున్ ఇండియా విడుదల చేసిన 2024 దాతృత్వ జాబితాలో.. టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు 'శివ్ నాడార్' రూ. 2153 కోట్లు విరాళమిచ్చి అగ్రగామిగా నిలిచారు. ఆ తరువాత ముకేశ్ అంబానీ, బజాజ్ ఫ్యామిలీ, కుమారమంగళం బిర్లా.. వంటి వారు ఉన్నారు. అయితే ఈ కథనంలో పిన్న వయసులో ఎక్కువ విరాళమిచ్చిన వ్యక్తిని గురించి తెలుసుకుందాం.38 ఏళ్ల నిఖిల్ కామత్ రెయిన్‌మాటర్ ఫౌండేషన్ ద్వారా వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు రూ. 120 కోట్లను విరాళంగా ఇచ్చినట్లు హురున్ ఇండియా జాబితా ద్వారా తెలిసింది. దీంతో భారతదేశంలో చిన్న వయసులో ఎక్కువ డబ్బును దాతృత్వ కార్యక్రాలకు వెచ్చించిన వ్యక్తిగా నిఖిల్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. రూ. 100 కోట్లకు పైగా విరాళాలు అందించిన వారిలో ఈయన 15వ స్థానంలో నిలిచారు.ఇదీ చదవండి: ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్నిఖిల్ కామత్ తరువాత.. జాబితాలో ఎక్కువ విరాళాలు అందించిన ఇతర యువ పరోపకారులలో వివేక్ వకీల్, మాధవకృష్ణ సింఘానియా, సరందర్ సింగ్, వరుణ్ అమర్ వాకిల్, రాఘవపత్ సింఘానియా కూడా వున్నారు. అయితే నిఖిల్ కామత్ ఈ జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. యువ వ్యాపారవేత్తలు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. -
తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా?
పారిశ్రామికవేత్త టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు, దాత శివ్ నాడార్ (జూలై 14) 78వ పడిలోకి అడుగుపెట్టారు. సెల్ఫ్-మేడ్ ఇండియన్ బిలియనీర్ శివ నాడార్ తన దూరదృష్టి , మార్గదర్శక నిర్ణయాలతో దేశీయంగా తొలి వ్యక్తిగత కంప్యూటర్ను అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఎదగడానికి సహాయం చేసినవారిలో శివ నాడార్ ప్రముఖుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు విద్యా, గ్రామీణాభివృద్ధిపై శివ నాడార్ ఫౌండేషన్, ఇతర అనేక స్వచ్ఛంద సంస్థలద్వారా భూరి విరాళాలిచ్చే గొప్ప పరోపకారి కూడా. ఎక్కడ పుట్టారు? తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని తిరుచందూర్ దగ్గర్లోని మూలైపోజి అనే పల్లెటూర్లో పుట్టారు శివనాడార్. కోయంబత్తూర్‌లోని పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, నాడార్ 1967లో పూణేలోని వాల్చంద్ గ్రూప్ కూపర్ ఇంజనీరింగ్‌లో కరియర్ ప్రారంభించారు. అనంతరం ఢిల్లీ క్లాత్ మిల్స్ డిజిటల్ ఉత్పత్తుల విభాగంలో ఉద్యోగానికి మారారు. (జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్) 1975లో హెచ్‌సీఎల్ ఆవిర్భావం ఆ తర్వాత 1975లో, తన స్నేహితులు, సహోద్యోగులతో కలిసి మైక్రోకాంప్ లిమిటెడ్ అనే పేరుతో తన సొంత వెంచర్‌ను ప్రారంభించాడు. కంపెనీలో అతిపెద్ద వాటాదారు అయిన నాడార్‌తో సహా 8 మంది భాగస్వాములు ఉన్నారు. కంపెనీ తొలుత టెలి-డిజిటల్ కాలిక్యులేటర్లను విక్రయించడంపై దృష్టి సారించింది. 1976లో ఐబీఎం ఇండియా నుంచి వెళ్లిపోవడంతో నాడార్ భారతదేశంలోని కంప్యూటర్ మార్కెట్ అవకాశాలపై దృష్టి పెట్టారు. కేవలం 18,700 రూపాయల ప్రారంభ పెట్టుబడితో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఆవిష్కరించారు. హెచ్సీఎల్ను మొదటి పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి)గా మార్చే కంపెనీలో 26 శాతం వాటాకు బదులుగా రూ. 20 లక్షల అదనపు గ్రాంట్‌తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మద్దతిచ్చింది. 1999లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో హెచ్‌సీఎల్‌టెక్ లిస్ట్ అయింది. తొలి పీసీ, ఐటీ రంగంపై అంచనాలు ఐబీఎం, యాపిల్ కంటే ముందే దేశంలో తొలి హెచ్‌సీఎల్ 8సీ తొలి పీసీ 1978లో అందించిన ఘనత శివ నాడార్ దక్కించుకున్నారు. సొంత యాజమాన్య హార్డ్‌వేర్‌తో హార్డ్‌వేర్ కంపెనీగా ప్రారంభమై పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా రూపాంతరం చెందింది. తొలి ఏడాదిలోనే రూ. 10 లక్షల అమ్మకాలతో 1979 నాటికి రూ. 3 కోట్ల విలువైన కంపెనీగా నిలిచింది. అంతేనా ఐటీ రంగం, ఐటీ సేవలను ప్రాధాన్యతను అప్పట్లోనే పసిగట్టి, ఇందుకోసం సింగపూర్‌కు మారారు. అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, 2022లో, సంస్థ 11.5 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సాధించింది.బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, శివ్ నాడార్ నికర విలువ సుమారు 25.9 బిలియన్ల డాలర్లు అని అంచనా. 2020లో దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపనీ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్‌గా తన బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఏకైక కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. శివసుబ్రమణ్య నాడార్ పేరుతో పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపిస్తే శివ నాడార్ స్థాపించారు. 1994లో నాడార్ తన దాతృత్వ సంస్థ శివ్ నాడార్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. తండ్రికి తగ్గ కూతురిగా రోషిణి నాడార్ తన తండ్రి శివ నాడార్ పేరిట "శివనాడార్ విశ్వవిద్యాలయం" స్థాపించడం విశేషం. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ జాబితాలో -2022 జాబితాలో శివ్ నాడార్ టాప్‌లో నిలిచారు. 2021-22 మధ్య ఆయన ఏకంగా రూ.1,161 కోట్లు విరాళం ఇచ్చారు. అంటే సగటున రోజుకు శివ్ నాడార్ రూ.3 కోట్లు విరాళం గొప్ప పరోపకారిగా నిలిచారు. -
ఎన్ఆర్ఐ కోటేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: తన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఎన్నో అవార్డులు స్వీకరించిన ఎన్ఆర్ఐ కోటేశ్వరరావుకు ఏపీయూ వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు తాజాగా గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. ఈ విషయాన్ని సోమాజిగూడలో ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా కావలికి ఏదైనా చేయాలనే తపనతో పలు సేవా కార్యక్రమాలు చేశానన్నారు. అందులో భాగంగా బ్లడ్‌బ్యాంక్, కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా శ్మశానవాటిక ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలకు గతంలో హిందూ రతన్ అవార్డుతో పాటు పలు అవార్డులు వచ్చాయన్నారు. తాజాగా గౌరవ డాక్టరేట్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డాక్టరేట్ రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేస్తానని ఆయన తెలిపారు. -
జైలు నుంచే జగన్ ప్రజా ఉద్యమం: పి.గౌతమ్‌రెడ్డి
విజయవాడ, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చిన కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తోందని వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు ప్రజల రాష్ట్రాన్ని సోనియాగాంధీ కేకు ముక్కలా కోసేసిందని ధ్వజమెత్తారు. కోట్లాదిమంది ప్రజల మనోగతంకన్నా కాంగ్రెస్ పార్టీకి నీచ, స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. జనహితమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజలకు సమన్యాయం చేయాలనే డిమాండ్‌తో పోరు సాగిస్తున్నామని చెప్పారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైల్లో ఉన్నా, జనంలో ఉన్నా ప్రజాసమస్యలపై పోరాటమే ఊపిరిగా ముందుకెళుతున్నారన్నారు. ఆయన జైల్లో సైతం ఉద్యమజ్వాల రగిలించిన పోరాట యోధుడని కొనియాడారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన కుటుంబం ఏదైనా ఉందంటే, అది వైఎస్సార్ కుటుంబమేనన్నారు. ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ముందుగా నడుంబిగించింది ఆ కుటుంబమేనని పేర్కొన్నారు. ఉద్యమం నీరుగార్చేందుకు కుట్ర.. టీడీపీ, కాంగ్రెస్‌లు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రపన్నుతున్నాయని గౌతమ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చేందుకు సిద్ధమైన పార్టీలు ఇప్పుడు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆత్మగౌరవయాత్రకు రావడం సిగ్గుమాలిన చర్యగా వర్ణించారు. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని హితవు చెప్పారు. లగడపాటీ.. నీవెక్కడ? ఎంపీ లగడపాటి రాజగోపాల్ బఫూన్లా మారి సరికొత్త విన్యాసాలతో ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని గౌతమ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజంగా ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే సోనియా ఇంటిముందు ధర్నా చేయాలన్నారు. స్పీకర్ ఫార్మాట్లో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సూచించారు. పదవుల్ని అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదించడం తప్ప లగడపాటి ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. చివరికి ఆయన సమైక్యాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే లగడపాటి ముఖం చాటేసిన సంగతి ప్రజలు మరిచిపోరన్నారు.