న్యూఢిల్లీ: టాటాల బాటలోనే రియల్టీ దిగ్గజం అభిషేక్ లోధా, ఆయన కుటుంబం దాతృత్వ కార్యక్రమాల కోసం భారీ స్థాయిలో విరాళమిచ్చింది. లిస్టెడ్ సంస్థ మ్యాక్రోటెక్ డెవలపర్స్‌లో 18 శాతం వాటాకు సరిసమానమైన షేర్లను లాభాపేక్షరహిత సంస్థ లోధా ఫిలాంత్రొపీ ఫౌండేషన్‌కు (ఎల్‌పీఎఫ్) బదలాయించింది.
శుక్రవారం షేరు ముగింపు ధర రూ. 1,175.75 ప్రకారం వీటి విలువ రూ. 21,000 కోట్ల పైగా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం 2013లో ప్రారంభించిన ఎల్‌పీఎఫ్ .. జాతీయ, సామాజిక ప్రయోజన కార్యక్రమాలపై పని చేస్తోంది. విరాళంగా లభించిన షేర్లపై వచ్చే రాబడిన ఎల్‌పీఎఫ్.. విద్య, మహిళా సాధికారత తదితర సామాజిక సేవా కార్యక్రమాల కోసం వెచ్చించనుంది.
టాటాల బాటలోనే తమ సంపదలో గణనీయమైన భాగాన్ని సమాజ ప్రయోజన కార్యక్రమాల కోసం కేటాయించాలని కుటుంబం నిర్ణయం తీసుకున్నట్లు అభిషేక్ లోధా గతంలో వెల్లడించారు. ‘వందేళ్ల క్రితం టాటా కుటుంబం గ్రూప్ సంస్థల్లోని షేర్‌హోల్డింగ్‌లో సింహభాగాన్ని టాటా ట్రస్ట్స్‌కి బదలాయించింది. దేశానికి ప్రయోజనం చేకూర్చేలా ఈ బహుమతి గణనీయంగా ప్రభావం చూపడం, టాటా ట్రస్ట్స్ చేపట్టిన అనేక మంచి పనులు నాకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment