సాక్షి, హైదరాబాద్: తన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఎన్నో అవార్డులు స్వీకరించిన ఎన్‌ఆర్‌ఐ కోటేశ్వరరావుకు ఏపీయూ వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు తాజాగా గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. ఈ విషయాన్ని సోమాజిగూడలో ఆయన స్వయంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా కావలికి ఏదైనా చేయాలనే తపనతో పలు సేవా కార్యక్రమాలు చేశానన్నారు. అందులో భాగంగా బ్లడ్‌బ్యాంక్, కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా శ్మశానవాటిక ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలకు గతంలో హిందూ రతన్ అవార్డుతో పాటు పలు అవార్డులు వచ్చాయన్నారు. తాజాగా గౌరవ డాక్టరేట్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డాక్టరేట్ రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేస్తానని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment