1492 యూనిట్లకు మారుతి రీకాల్
1492 యూనిట్లకు మారుతి రీకాల్
Published Wed, Nov 27 2013 4:22 PM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
దేశంలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి సుజుకి 1492 యూనిట్ల మారుతి ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్, ఏ స్టార్ మోడల్స్ ను రీకాల్ చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. స్టీరింగ్ కాలమ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకున్న మారుతి ఎర్టిగా, స్విఫ్ట్, డిజైర్, ఏ స్టార్ మోడల్స్ యూనిట్లలో మళ్లీ ఉత్పత్తి చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 1492 వాహనాల్లో తలెత్తిన సమస్యను క్షుణ్టంగా కంపెనీ పరిశీలిస్తోందన్నారు.
ఎర్టిగా 306 యూనిట్లు, స్విఫ్ట్ 592, డిజైర్ 581, ఏ స్టార్ 13 యూనిట్లను 2013 అక్టోబర్ 19 నుంచి 26 అక్టోబర్ వరకు ఉత్పత్తి చేసింది. 1492 వాహనాల్లో స్టీరింగ్ కాలమ్స్ లో తలెత్తిన సమస్యలకు కంపెనీ ఉచితంగా సేవలందింస్తుందని సంస్థ కు చెందిన నిర్వాహకులు తెలిపారు. కొత్త గా తయారు చేసిన స్టీరింగ్ కాలమ్స్ ను డీలర్ వర్క్ షాప్ లకు పంపామని మారుతి సంస్థ తెలిపింది. 2010 ఫిబ్రవరిలో కూడా 'ఏ స్టార్' కారులో ఫ్యూయల్ పంప్ పార్ట్ లో సమస్యలు తలెత్తడంతో పెద్ద ఎత్తున రీకాల్ చేసింది.
కార్ల ఉత్పత్తిలో వినియోగదారుల ప్రయోజనాలకు ఇబ్బంది ఉంటే వాలంటరీ రీకాల్ చేయాలని గత జూలైలో ఆటో మోబైల్ కంపెనీల చెందిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చర్స్ సూచించించి. దాంతో మూడు లక్షలకు పైగా కార్లను కంపెనీలు రీకాల్ చేశాయి. ఇంజన్ లో సమస్యలు తలెత్తడంతో సెయిల్ మోడల్ కు చెందిన నాలుగు వేల డీజీల్ వేరియెంట్ కార్లను గతంలో మారుతి రీకాల్ చేసింది.
Advertisement