పటాన్‌చెరు (మెదక్):పటాన్‌చెరు మండలం కర్ధనూర్ గ్రామ శివారులో ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుపై ఓ మారుతి స్విఫ్ట్ కారు(ఏపీ 23, క్యూ 5694) శనివారం రాత్రి దగ్ధమైంది. పోలీసుల కథనం ప్రకారం బీడిఎల్ ఉద్యోగి శ్రీనివాస్‌రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి దుండిగల్ ఆశ్రమానికి వెళ్తున్నారు. .
ఓఆర్‌ఆర్ కొల్లూర్ వద్ద ఉన్న జంక్షన్ మీదుగా దుండిగల్ వెళ్లే క్రమంలోషార్ట్ సర్క్యుట్‌తో ఆయన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన తన భార్య పిల్లలతో కలిసి కారులోంచి కిందకు దిగారు.