
అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్‌ల్లో ఒకటిగా పేరున్న మారుతీ సుజుకీ స్విఫ్ట్, కొత్త జనరేషన్‌లోకి ప్రవేశించబోతుంది. మరికొన్ని వారాల్లో జరుగబోతున్న ఆటో ఎక్స్‌పో 2018లో కొత్త స్విఫ్ట్‌ను లాంచ్ చేసేందుకు మారుతీ సుజుకీ సిద్ధమవుతోంది. పాత మోడల్‌తోనే ఇప్పటికే పాపులర్ కారుగా పేరు తెచ్చుకున్న స్విఫ్ట్, కొత్త రూపకల్పనతో మరింత ఆకట్టుకోబోతుంది. ఈ కొత్త స్విఫ్ట్ పాత దానికి కంటే మరింత ప్రీమియంగా ఉండబోతుందని తెలుస్తోంది. లోపల, బయట కొత్త కొత్త ఫీచర్లతో దీన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెడుతుందని ఆటో వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అసలు పాత దాని కంటే కొత్త దాని ఎంత మెరుగ్గా తీర్చిదిద్దిందో ఓసారి తెలుసుకుందాం...
డిజైన్...
కొత్త స్విఫ్ట్ పూర్తిగా రీడిజైన్ చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు ఉన్నమోడల్స్‌కు పూర్తిగా భిన్నంగా, మోడరన్ లుక్స్‌లో, స్పోర్టీగా, మోర్ ప్రీమియంగా దీన్ని ప్రవేశపెడుతోంది. క్రోమ్ ఇన్‌సెర్ట్స్‌తో హెక్సాగోనల్ గ్రిల్‌ను, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఎల్‌ఈడీ టైల్ ల్యాంప్స్‌తో ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్‌తో ఇది మార్కెట్‌లోకి వస్తోంది.
క్యాబిన్...
ప్రస్తుతమున్న మోడల్ మాదిరిగా కాకుండా... కొత్త కారు ఫ్లాట్-బోటమ్ స్టీరింగ్ వీల్‌తో ఇది రూపొందింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అలాగే డ్యాష్‌బోర్డుకు కొత్త లేఅవుట్ దీనిలో ఇతర మార్పులు.
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్...
నేవిగేషన్‌ను సపోర్టు చేసే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇది కలిగిఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కారు ప్లే వంటివి కూడా దీనిలో ఉన్నాయి. తేలికపాటి బరువున్న కార్లను రూపొందే హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద దీన్ని మారుతీ సుజుకి నిర్మించింది. దీంతో ప్రస్తుతమున్న దానికంటే ఇది చాలా తేలికగా ఉండబోతుంది.
ఇంజిన్...
1.2 లీటరు పెట్రోల్ ఇంజిన్‌ను ఇది అందిస్తుంది. 83హెచ్‌పీ పవర్, 115 ఎన్‌ఎం టర్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. 1.3 లీటరు డీజిల్ ఇంజిన్‌ను ఇది కలిగి ఉంది. ఈ ఇంజిన్ 74 హెచ్‌పీ పవర్, 190 ఎన్‌ఎం టర్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు యూనిట్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తోనే అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేస్తుంది.
బూట్ స్పేస్...
ప్రస్తుతమున్న స్విఫ్ట్ బూట్ స్పేస్ 316 లీటర్లు. ఈ స్పేస్‌ను మారుతీ సుజుకి మరో 54 లీటర్లు పెంచింది. కొత్త స్విఫ్ట్ పొడవులో 10ఎంఎం చిన్నది. ప్రస్తుతమున్న మోడల్‌తో పోలిస్తే 40ఎంఎం వెడల్పు, 35ఎంఎం లోయర్, 20ఎంఎం లాంగర్ వీల్‌బేస్‌ను ఇది ఆఫర్ చేస్తుంది.
ధర...
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న స్విఫ్ట్ బేస్ మోడల్ ధర రూ.4.89 లక్షలు. టాప్ మోడల్ ధర రూ.7.55 లక్షలు. కొత్త దానిలో ఫీచర్లను అధికంగా అందిస్తుండటంతో, ధర ప్రస్తుతమున్న దానికంటే మరో రూ.30వేల నుంచి రూ.40వేల వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment