
ఢిల్లీ: వినియోగదారులకు మారుతి ఆటో షాక్ ఇచ్చింది. మారుతిలో మోస్ట్ పాపులర్ మోడల్ స్విఫ్ట్‌తో పాటు ఇతర వేరియంట్లకు ధరలను అమాంతం పెంచేసింది. కారు తయారీలో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మారుతి ప్రకటించింది.
రూ. 15,000
మారుతి కార్ల ధరలు పెంచుతామంటూ 2021 జూన్ 21న ఇప్పటికే ప్రకటించామని, దానికి తగ్గట్టుగా స్విప్ట్ మోడల్‌తో పాటు అన్ని సీఎన్‌జీ వేరియంట్ల కార్ల ధరలు పెంచుతున్నామని మారుతి ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం కనీసం రూ.15,000 ధర పెంచామని వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఈ మోడళ్లపై
ప్రస్తుతం మారూతిలో స్విఫ్ట్ డిజైర్ టూర్‌తో పాటు ఎర్టిగా, వ్యాగన్ ఆర్, ఆల్టో, సెలేరియో, ఎస్‌ప్రెస్సో, ఏకో మోడళ్లలో సీఎన్‌జీ కార్లు లభిస్తున్నాయి. మొత్తంగా మారుతిలో ఎక్కువగా అమ్ముడయ్యే మోడల్స్‌పై ధరలు పెరిగాయి. ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే స్టాక్‌మార్కెట్‌లో మారూతి షేర్ల ధరలు కూడా పెరిగాయి.