మహీంద్రా థార్ ఎస్‌యూవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మారుతి జిమ్నీ ప్రారంభంలో కొంత ఆశాజనక అమ్మకాలను పొందినప్పటికీ.. ప్రస్తుతం డీలా పడింది. దీనికి ప్రధాన కారణం పరిమాణంలో చిన్నదిగా ఉండటమే కాకుండా.. థార్ కంటే ఎక్కువ ధర కలిగి ఉండటం. ఈ కారు అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇటీవల ఈ కారును కేరళ పోలీసులు పెట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ సంస్థ కూడా జిమ్నీ కార్లను తమ ఫ్లీట్‌లో చేర్చలేదు. మొదటిసారి కేరళ పోలీసులు ఈ కారును తమ విభాగంలో చేర్చారు. ఈ జిమ్నీ ఫ్రంట్ విండ్‌షీల్డ్‌పైన కేరళ పోలీస్ స్టిక్కర్స్ ఉండటం చూడవచ్చు. బానెట్‌పై రాజాక్కాడ్ పోలీస్ స్టేషన్ స్టిక్కర్ ఉండటం గమనించవచ్చు. ఈ కారును ప్రత్యేకంగా రెస్క్యూ కార్యకలాపాల కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఆఫ్-రోడర్ కార్లలో ఒకటి ఈ మారుతి జిమ్నీ. ఇది కే15బీ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 105 పీఎస్ పవర్, 134 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'
కేరళ పోలీసులు 4x4 వాహనాలను తమ విభాగాల్లో చేర్చడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే బోలెరో ఇన్‌వాడర్ 4x4, ఫోర్స్ గూర్ఖా 4×4 వంటి వాటిని పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మారుతి జిమ్నీ 4x4 కార్లు.. పోలీస్ విభాగంలోకి అడుగుపెట్టాయి. పరిమాణం పరంగా జిమ్నీ.. దాని ప్రత్యర్థుల కంటే చిన్నదిగా ఉన్నప్పటికీ, మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. జిమ్నీ ప్రారంభ ధర రూ. 12.74 లక్షలు (ఎక్స్ షోరూమ్).
Comments
Please login to add a commentAdd a comment