రోడ్డు ప్రమాదాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు నగదు రహిత చికిత్స అందించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ పథకం అమలు పైలట్ ప్రాతిపదికన ఇప్పటికే ప్రారంభమైంది.
ఎలాంటి రోడ్డులోనైనా మోటారు వాహనాల వల్ల సంభవించిన రోడ్డు ప్రమాదాల బాధితులకు నగదు రహిత చికిత్స అందించడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) సహకారంతో కేంద్ర రవాణా శాఖ చండీగఢ్, అస్సాంలలో పైలట్ ప్రాతిపదికన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ఈ పథకం కింద అర్హులైన బాధితులు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద నమోదైన ఆసుపత్రులలో ట్రామా, పాలీట్రామా కేర్‌కు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీలను ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల కాలానికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు పొందవచ్చు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, ఎంప్యానెల్ ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సమన్వయంతో ఎన్‌హెచ్‌ఏ ఈ పథకం అమలుకు బాధ్యత వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment