Maruti Suzuki eVX: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే మహీంద్రా, టాటా మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను దేశీయ విఫణిలో విడుదల చేసిన మంచి అమ్మకాలను పొందుతున్నాయి. కాగా మారుతి సుజుకి కూడా ఈవీ రంగంలో నేను సైతం అంటూ 2023 ఆటో ఎక్స్‌పోలో 'ఈవీఎక్స్' (eVX) కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఈ కారు ఇప్పుడు ఎట్టకేలకు టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన తరువాత ఈవీఎక్స్ రోడ్లమీద కనిపించడం ఇదే మొదటి సారి. ఈ కారు ఫోలాండ్ కాకో వీధుల్లో టెస్టింగ్ దశలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది. మారుతి సుజుకి ఇప్పటికే జపాన్‌కు చెందిన టయోటాతో ఇప్పటికే అనేక సెగ్మెంట్లలో ఒప్పందాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ రెండు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఓ కొత్త ప్లాట్ఫార్మ్ను రూపొందిస్తున్నాయి. దీని ఆధారంగా 'ఈవీఎక్స్' పుట్టుకొస్తోంది. ఇది 2025 నాటికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
డిజైన్ & రేంజ్
మార్కెట్లో విడుదలకానున్న మారుతి సుజుకి ఈవీఎక్స్ మంచి డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మస్క్యులర్ బానెట్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, వీ షేప్ డీఆర్ఎల్స్, మౌంటెడ్ ఓఆర్వీఎంలు, అలాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్‌లైట్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన ఇంటీరియర్ ఫీచర్స్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు, కానీ ఆధునిక కాలంలో వినియోగించడానికి కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయని భావిస్తున్నాము.
(ఇదీ చదవండి: ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్కటీ రాలేదు.. నేడు ప్రపంచ ధనికుల్లో ఒకడిగా!)
ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కారు 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన డ్యూయెల్ మోటార్ సెటప్ పొందుతుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జ్‌తో 550 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు ధర రూ. 18 - 20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment