అక్కినేని వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. రెండు రోజుల క్రితం మంగళస్నానాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలని స్వయంగా శోభితనే ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు పెళ్లి కోసం ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అదే టైంలో కాబోయే కోడలికి అక్కినేని ఫ్యామిలీ ఇవ్వబోయే బహుమతుల ఇవేనంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)
నాగచైతన్య-శోభిత గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబరు 4న అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలోనే వివాహం జరగనుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మెగా, దగ్గుబాటి కుటుంబ సభ్యులతో పాటు రాజమౌళి లాంటి అతికొద్ది మందే హాజరుకానున్నారని టాక్.
రీసెంట్‌గా నాగార్జున.. రూ.2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు. అయితే ఇది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే కొన్నారనే అనుకుంటున్నారు. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ బహుమతిగా ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: ధనుష్‌తో వివాదం.. విఘ్నేశ్ శివన్ మిస్సింగ్!)
Comments
Please login to add a commentAdd a comment