ధర రూ.2 కోట్లు.. అన్నీ బుక్ అయిపోయాయ్ | Lexus LM 350h Bookings Stopped in India | Sakshi
Sakshi News home page

ధర రూ.2 కోట్లు.. అన్నీ బుక్ అయిపోయాయ్

Published Sat, Sep 21 2024 9:03 PM | Last Updated on Sun, Sep 22 2024 6:03 PM

Lexus LM 350h Bookings Stopped in India

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బ్రాండ్ వాహనాలలో ఒకటైన లెక్సస్ తన 'ఎల్ఎమ్ 350హెచ్' (Lexus LM 350h) బుకింగ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. 2024 మార్చిలో లాంచ్ అయిన ఈ లగ్జరీ ఎంపీవీ బుకింగ్స్ 2023 ఆగష్టులో ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే కంపెనీ ఈ కారు కోసం 100 బుకింగ్స్ పొందింది.

కంపెనీ వంద బుకింగ్స్ పొందింది, కాబట్టి వీటిని డెలివరీ చేసిన తరువాత మళ్ళీ బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ బుకింగ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే మళ్ళీ ఎప్పుడు బుకింగ్స్ మొదలవుతాయనేది తెలియాల్సిన విషయం.

లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్
విశాలమైన క్యాబిన్ కలిగిన ఈ ఎంపీవీ.. పెద్ద ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. బ్లాక్, సోలిస్ అనే రెండు రంగులలో లభించే ఈ కారు 14 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. 23 స్పీకర్ ఆడియో సిస్టం, ఫోల్డ్ అవుట్ టేబుల్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్, రిఫ్రిజిరేటర్ మొదలైనవన్నీ ఇందులో లభిస్తాయి.

ఇదీ చదవండి: 4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటన

ఈ లగ్జరీ ఎంపీవీ 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 Bhp, 240 Nm టార్క్ అందిస్తుంది. ఏడు సీట్ల లెక్సస్ ఎల్ఎమ్350 హెచ్ ధర రూ. 2 కోట్లు. అయితే ఇదే మోడల్ 4 సీటర్ ధర రూ. 2.5 కోట్లు. ఈ కారు టయోటా వెల్‌ఫైర్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement