
న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ భారత్‌లోకి సరికొత్త ఎస్‌యూవీని విడుదల చేసింది. ఎల్‌ఎక్స్ 570 ఎస్‌యూవీని భారత మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. శక్తివంతమైన 5.7లీటర్ల వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో ఇది రూపొందింది. దీని ఎక్స్ షోరూం ధర 2.33 కోట్లుగా నిర్ణయించింది. క్లైమెట్ కంట్రోల్, బెటర్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్స్ మంచి డ్రైవింగ్ అనుభూతిని కల్పించనున్నాయి. ఈ కారులో విలాసవంతమైన 19 స్పీకర్లతో కూడిన ది మార్క్ లెవిన్సన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు.
మూడు వరుసల సీటింగ్‌ను దీనిలో అమర్చామని, ఒకవేళ అవసరమైతే అదనపు కార్గో స్పేస్‌కు ఇది ఉపయోగపడనుందని కంపెనీ తెలిపింది. వెనుక సీట్లకు 11.6 అంగుళాల లిక్విడ్ క్రిస్టల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డిస్‌ప్లే కూడా ఉంది. ‘ రహదారిపై అద్భుతమైన పట్టుసాధించే ఈ వాహనంతో వినియోగదారులు గొప్ప డ్రైవింగ్ అనుభూతిని ఆస్వాదిస్తారు’ అని లెక్సస్ ఇండియా చైర్మన్ ఎన్.రాజ తెలిపారు. నేటి నుంచి ఈ ఎల్‌ఎక్స్ 570 ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment