
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ తాజాగా ఎన్‌ఎక్స్ 350హెచ్ ఎస్‌యూవీలో సరికొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి ధర రూ. 64.9 లక్షలు, రూ. 69.5 లక్షలు, రూ. 71.6 లక్షలుగా (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. జనవరిలో ప్రి–బుకింగ్స్ ప్రారంభించగా, భారీ స్పందన లభించిందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోని తెలిపారు.
హైబ్రిడ్ సిస్టమ్, లెక్సస్ ఇంటర్‌ఫేస్, 14 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలో మల్టీమీడియా, డిజిటల్ సపోర్ట్, వైర్‌లెస్ చార్జింగ్, యూజర్ ప్రొఫైల్‌కు స్మార్ట్‌ఫోన్ కనెక్షన్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు మొదలైన ప్రత్యేకతలు ఈ సరికొత్త వెర్షన్‌లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా లగ్జరీ కార్ల మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమకు మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉన్నాయని, త్వరలో మరో మూడింటిని ప్రారంభించనున్నామని సోని వివరించారు.
చదవండి: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్..! ఆ సెగ్మెంట్‌లో చవకైన బైక్‌గా..!