Lauched
-
అచ్చం యాపిల్ స్మార్ట్‌వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!
సాక్షి, ముంబై: ఖరీదైన యాపిల్ వాచ్ కొనుగోలు చేయలేని వారికి గిజ్మోర్ తీపి కబురు అందించింది. అచ్చం యాపిల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌వాచ్ ‘అల్ట్రా’ లా కనిపించే స్మార్ట్‌వాచ్‌ను భారతీయ బ్రాండ్ గిజ్మోర్ తీసుకొచ్చింది. అదీ కూడా కేవలం 1,999 రూపాయలకే. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 2023 నుండి అందుబాటులో ఉంటుంది. బ్లాక్, ఆరెంజ్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. (ఇదీ చదవండి: ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది!150 కి.మీ. రేంజ్లో) బడ్జెట్ ధరలో గిజ్మోర్ తీసుకొచ్చిన కొత్త వాగ్ స్మార్ట్‌వాచ్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే స్మార్ట్‌వాచ్‌కు 10రోజుల బ్యాటరీ లైఫ్, 1.95-అంగుళాల HD డిస్ప్లే 320X385 పిక్సెల్స్, 91% బాడీ-టు-స్క్రీన్ రేషియో, మెరుగైన ఫారమ్ ఫ్యాక్టర్‌తో పెద్ద ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లేను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ షార్ట్‌కట్ మెనూ కోసం స్ప్లిట్-స్క్రీన్ వ్యూ కూడా ఉంది. పవర్ ఆన్ అండ్ ఆఫ్ కోసం 2 ప్రత్యేక బటన్స్, ఎపుడూ ఆన్‌లో ఉండే డిస్ప్లే స్క్రీన్ 600 నిట్స్ బ్రైట్నెస్ను కూడా అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ GPS ట్రాజెక్టరీ ఫీచర్‌ను హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్, పీరియడ్ ఎలర్ట్, స్లీప్ సైకిల్, meditation, sedentary and dehydration లాంటి రిమైండర్స్ కూడా ఇస్తుందట. యాపిల్ స్మార్ట్‌వాచ్ ‘అల్ట్రా’ ప్రారంభ ధర రూ. 89,900. (మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్) -
లెక్సస్ నుంచి సరికొత్త ఎన్ఎక్స్ 350హెచ్ ఎస్యూవీ
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ తాజాగా ఎన్ఎక్స్ 350హెచ్ ఎస్‌యూవీలో సరికొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి ధర రూ. 64.9 లక్షలు, రూ. 69.5 లక్షలు, రూ. 71.6 లక్షలుగా (ఎక్స్–షోరూమ్) ఉంటుంది. జనవరిలో ప్రి–బుకింగ్స్ ప్రారంభించగా, భారీ స్పందన లభించిందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోని తెలిపారు. హైబ్రిడ్ సిస్టమ్, లెక్సస్ ఇంటర్ఫేస్, 14 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లేలో మల్టీమీడియా, డిజిటల్ సపోర్ట్, వైర్లెస్ చార్జింగ్, యూజర్ ప్రొఫైల్‌కు స్మార్ట్‌ఫోన్ కనెక్షన్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు మొదలైన ప్రత్యేకతలు ఈ సరికొత్త వెర్షన్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా లగ్జరీ కార్ల మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమకు మూడు ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉన్నాయని, త్వరలో మరో మూడింటిని ప్రారంభించనున్నామని సోని వివరించారు. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్..! ఆ సెగ్మెంట్లో చవకైన బైక్‌గా..! -
స్వదేశీ న్యూక్లియర్ క్షిపణి పృథ్వి-2 సక్సెస్
బాలాసోర్: దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసిన.. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన పృథ్వి-2 క్షిపణిని బుధవారం ఒడిశాలోని చాందీపూర్ నుంచి భారత ఆర్మీ విజయవంతంగా ప్రయోగించింది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని పరీక్షించారు. భారత భూభాగం నుంచి ఇతర భూభాగాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు ఈ క్షిపణి ఉపయోగపడనుందని డిఫెన్స్ అధికారులు తెలిపారు. పృథ్వి-2ను రెండుసార్లు వెంటవెంటనే పరీక్షించాలని మొదట్లో అనుకున్నా.. మొదటి ట్రయల్‌ను 2016 ఫిబ్రవరి 16న నిర్వహించగా తర్వాత వచ్చిన సాంకేతిక లోపం వల్ల ఆలస్యం అయినట్లు వివరించారు. ఇస్రో సొంతంగా తయారుచేసిన ద్రవ ఇంధనాలతో.. రెండు ఇంజన్లతో నింగిలోకి ఎగిసే పృథ్వి-2 500 కేజీలు, 1000 కేజీల పేలుడు పదార్ధాలను మోసుకుని 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అత్యాధునిక ఇనర్టియల్ గైడెన్స్ సిస్టంను ఉపయోగించుకుని లక్ష్యాన్ని చేరుకోగలదు. దేశ అత్యున్నత డిఫెన్స్ సంస్థలైన స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ (ఎస్ఎఫ్ సీ), డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)లు పృథ్వి-2ను రూపొందించాయి. బుధవారం ఉదయం 9.40 నిమిషాల ప్రాంతంలో ప్రయోగించిన క్షిపణిని డీఆర్డీవోకు చెందిన రాడార్లు, ఎలక్ట్రో- ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టంలు, టెలీమెట్రీ స్టేషన్ల ద్వారా విజయవంతమైనట్లు గుర్తించామని రక్షణ శాస్త్రజ్ఞులు తెలిపారు. భారతీయ సైన్యంలోకి 2003లో ప్రవేశించిన పృథ్వి శ్రేణి క్షిపణిని తొలిసారి డీఆర్డీవో తయారుచేసిందనీ.. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉన్న ఈ మిస్సైల్ విజయం సాధించిందని డిఫెన్స్ అధికారులు తెలిపారు.