Vikram Movie: Kamal Haasan Special Watch Gift To Actor Suriya, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Vikram - Kamal Haasan: సూర్యకి ఖరీదైన వాచ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్‌.. ధర ఎంతంటే..

Published Wed, Jun 8 2022 4:41 PM | Last Updated on Wed, Jun 8 2022 5:32 PM

Vikram Movie: Kamal haasan Gifts A  Watch To Suriya - Sakshi

విక్రమ్‌ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు కమల్‌ హాసన్‌. ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో విక్రమ్‌ విజయాన్ని అందరితో షేర్‌ చేసుకుంటున్నాడు ఈ లోకనాయకుడు. సినిమా సక్సెస్‌లో కీలక పాత్రలు పోషించిన వారందరికి గిఫ్ట్‌లను అందిస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. ఇప్పటికే విక్రమ్‌ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌కు ఖరీదైన కారు, 13 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లకు రూ.1.45 లక్షలు విలువ చేసే బైక్‌లను బహుమతిగా ఇచ్చాడు.

(చదవండి:  ‘విక్రమ్‌’ మూవీ రివ్యూ)

తాజాగా హీరో సూర్యకు ఊహించని గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ మూవీలో హీరో సూర్య ఓ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. క్లైమాక్స్‌లో డ్రగ్స్‌ మాఫీయా లీడర్‌ రోలెక్స్‌గా ఎంట్రీ ఇచ్చిన సూర్య.. చివరి మూడు నిమిషాలు దుమ్ముదులిపేశాడు. కేవలం కమల్‌ హాసన్‌ కోసమే సూర్య ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాడట. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్‌ తీసుకోలేదని వార్తలు వినిపించాయి. అందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో తన సొంత రోలెక్స్ వాచ్‌ను సూర్య కి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని హీరో సూర్య సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.

(చదవండి: 13 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లకు కమల్‌ ఖరీదైన బైక్స్‌ గిఫ్ట్‌)

‘ఇలాంటి క్షణమే జీవితాన్ని అందంగా మారుస్తుంది. థ్యాంక్స్‌ అన్నయ్యా’ అంటూ ఆ ఫోటోలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు సూర్య. ప్రస్తుతం నెటిజన్స్‌ దృష్టి ఆ వాచ్‌పై పడింది. అది ఏ మోడల్‌ వాచ్‌? దాని ధర ఎంతని నెటిజన్స్‌ సెర్చ్‌ చేస్తున్నారు. ఇది Rolex Day-Date 40 Rose Gold President మోడల్‌ అని తెలుస్తుంది. దీని విలువ దాదాపు రూ. 60 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సూర్య మాత్రం తన అభిమాన హీరో నుంచి మంచి బహుమతినే పొందాడు. ఇక వీరిద్దరు కలిసి ఖైదీ2లో కలిసి నటించబోతున్నారు. ఈ విషయాన్ని విక్రమ్‌ క్లైమాక్స్‌లో సూర్యతో పరోక్షంగా చెప్పించారు దర్శకుడు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే.. కొన్నేళ్లు ఆగాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement