Chiranjeevi Hosts Dinner For Salman Khan, Lokesh Kangaraj And Kamal Haasan At Home - Sakshi
Sakshi News home page

Chiranjeevi: చిరు ఇంట్లో విక్రమ్‌ టీంకు గ్రాండ్‌ పార్టీ, సల్మాన్‌ ఖాన్‌ సందడి

Published Sun, Jun 12 2022 12:12 PM | Last Updated on Sun, Jun 12 2022 9:04 PM

Chiranjeevi Hosts Grand Party To Vikram Movie Team At His Home - Sakshi

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నటించిన విక్రమ్‌ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజు దర్శకత్వం వహించాడు. గత శుక్రవారం(జూన్‌ 3న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లో సైతం విక్రమ్‌ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉ‍న్న కమల్‌ ఈ మూవీ నటీనటులతో పాటు డైరెక్టర్‌, మూవీ బృందానికి బహుమతులు అందించాడు.

చదవండి: అలాంటి వారిని దగ్గరికి రానివ్వకండి: ఆసక్తిగా హీరోయిన్‌ ట్వీట్‌

ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి లోకనాయకుడిని సత్కరించాడు. విక్రమ్‌ మంచి విజయం అందుకున్న సందర్భంగా కమల్‌ హాసన్‌తో పాటు డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజును చిరు ఇంటికి ఆహ్వానించి అభినందనలు తెలిపాడు. అనంత‌రం ఇంట్లో వారికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ కూడా వచ్చి విక్రమ్‌ మూవీకి అభినందలు తెలిపాడు. ఈ సందర్భంగా చిరు ట్వీట్‌ చేస్తూ విక్రమ్‌ టీంను సత్కరించిన ఫొటోలను షేర్‌ చేశాడు. ‘నా పాత స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది.

చదవండి: ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన

విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించినందుకు నిన్న రాత్రి మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను. కమల్‌హాసన్‌తో పాటు సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్‌ మా ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ మూవీ చాలా అద్భుతంగా, థ్రిల్లింగ్‌గా ఉంది. అభినందనలు మిత్రమా. ఈ సినిమా విజయం నీకు మరింత శక్తిని ఇస్తుంది’ అంటూ చిరు ట్వీట్‌లో రాసుకొచ్చాడు. కాగా కమల్‌ తన సొంత బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌  విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. తమిళ స్టార్ సూర్య కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement