Watch: Kamal Haasan Vikram Movie Making Video Released, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Vikram Movie Making Video: ‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా?.. డైరెక్టర్‌ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా!

Published Sat, Jul 9 2022 12:33 PM | Last Updated on Sat, Jul 9 2022 1:36 PM

Kamal Haasan Vikram Movie Making Video Released - Sakshi

ఉలగ నాయగన్‌ (లోక నాయకుడు) కమల్‌ హాసన్‌ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా వసూళు సాధించి కమల్‌ హాసన్‌ కెరీర్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్‌ హాసన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

చదవండి: కానిస్టెబుల్‌గా విశాల్‌.. ఏడేళ్ల పిల్లాడికి తండ్రిగా హీరో రోల్‌

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సంబంధించిన మేకింగ్‌ వీడియోను తాజాగా డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ విడుదల చేసింది. 6 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో దాదాపు యాక్షన్‌ సీన్స్‌కు సంబంధించిన మేకింగ్‌ సన్నివేశాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో దూసుకెళుతోంది. ఫహద్‌ ఫాజిల్‌ సీన్‌తో మొదలైన ఈ మేకింగ్‌ వీడియోలో విజయ్‌ సేతుపతి, కమల్‌కు సంబంధిచిన పలు భారీ యాక్షన్‌ సీన్స్‌తో పాటు మూవీలో హైలేట్‌గా నిలిచి ఫైట్‌ సన్నివేశాలను చిత్రీకరించిన తీరును చూపించారు.

చదవండి: ‘ధాకడ్‌’ మూవీ ఫ్లాప్‌.. షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన కంగనా

ఇందులో దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ను చూస్తుంటే ప్రతి సీన్‌లో కోసం ఆయన ఎంతటి జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది. మేకింగ్‌తో పాటు హీరో, విలన్‌ లుక్స్‌లోనూ స్పెషల్‌ కేర్‌ తీసుకున్నాడు. కొన్ని చోట్ల ఫైట్‌ సీన్స్‌ కోసం లోకేశ్‌.. కమల్‌ లుక్‌కు స్వయంగా మెరుగులు దిద్దుతూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి మేకింగ్‌కు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయనపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘విక్రమ్‌ మేకింగ్‌, ప్రతి ఫ్రేమ్‌లో విషయంలో మీరు పెట్టిన ఫోకస్‌ కనిపిస్తుంది’,‘ఈ సినిమా కోసం మీరు పెట్టిన ఎఫర్టే విక్రమ్‌ సక్సెస్‌’ అంటూ లోకేశ్‌ కనకరాజ్‌ను కొనియాడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement