‘‘మరో చరిత్ర’ సినిమా తర్వాత నాకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఈ విషయంలో నేనెప్పుడూ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఉంటాను. ఆ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చెన్నైలో రెండున్నరేళ్లు ఆడింది. సినిమాకి భాష లేదు.. సినిమాది ప్రపంచ భాష. ‘విక్రమ్’ విజయం నాలో మరోసారి గొప్ప ఉత్సాహాన్ని నింపింది’’ అని కమల్‌హాసన్ అన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ నెల 3న తెలుగులో రిలీజ్ చేశారు.
చదవండి: పక్షవాతం బారిన జస్టిన్ బీబర్, వీడియో వదిలిన స్టార్ సింగర్
మూవీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విక్రమ్ సక్సెస్ మీట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘నితిన్, సుధాకర్ రెడ్డిగారి వల్లే ‘విక్రమ్’ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. రానాకి నేనంటే ఎంత ఇష్టమంటే.. ‘నా సినిమా ఫ్లాప్ అయినా కూడా బావుంది’ అని మెచ్చుకునేవాడు’’అన్నారు. ‘‘విక్రమ్’ ని పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’అన్నారు లోకేష్ కనగరాజ్. ‘‘విక్రమ్’ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు సుధాకర్ రెడ్డి. ‘‘విక్రమ్’ చిత్రాన్ని ఒకే రోజు తెలుగు, తమిళ భాషల్లో చూశాను’’ అన్నారు రానా.
Comments
Please login to add a commentAdd a comment