Chandoo Mondeti Says Want To Make Film With Nagarjuna Like Vikram - Sakshi
Sakshi News home page

Chandoo Mondeti: భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్‌

Published Tue, Aug 2 2022 3:02 PM | Last Updated on Tue, Aug 2 2022 3:57 PM

Chandoo Mondeti Says Want To Make Film With Nagarjuna Like Vikram - Sakshi

Chandoo Mondeti About Karthikeya 2 Movie: 2014లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత పెద్ద హిట్‌ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన చందూ మొండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత ప్రేమమ్‌, సవ్యసాచి, బ్లడీ మేరీ సినిమాలతో తనదైన శైలీలో పలకరించాడు ఈ యంగ్‌ డైరెక్టర్‌. ఇప్పుడు తాజాగా 'కార్తికేయ'కు సీక్వెల్‌గా 'కార్తికేయ 2' వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో యంగ్‌ హీరో నిఖిల్‌, బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ నటించారు. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, పోస్టర్స్‌కు మంచి స్పందన లభించింది. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఆగస్ట్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వినూత్నంగా కాంటెస్ట్‌ పేరుతో ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్‌ చందూ మొండేటి, హీరో నిఖిల్‌. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది చిత్రబృందం.

చదవండి: బికినీలో గ్లామర్‌ ఒలకబోస్తున్న హీరోయిన్‌ వేదిక..
నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్‌ ఖాన్‌ ఆవేదన

''నాకు కింగ్‌ నాగార్జున అంటే చాలం ఇష్టం. ఆయనతో ఓ పోలీస్‌ కథపై చర్చలు జరుగుతుంటాయి. ఒకవేళ ఇప్పుడు ఈ మూవీ సక్సెస్‌ అయితే నాగార్జునతో 'విక్రమ్‌' లాంటి సినిమా చేయాలని ఉంది'' అని చందూ మొండేటి తెలిపారు. అలాగే హోస్ట్‌ అడిగిన 'నువ్వొక చిన్న సైజు విజయ్‌ మాల్య అట కదా' అనే ప్రశ్నకు 'ఏంటీ స్కాములా.. దొంగతనం కూడా చేశామంటారు' అని చందూ జవాబివ్వగా.. 'అదంతా ఒకప్పుడు' అని నిఖిల్‌ అన్నాడు. 'కార్తికేయ 2'లో చాలా పాములుంటాయని, 'భార్యలకు అబద్ధాలు చెప్పకపోతే, ఇన్నికాపురాలు ఉంటాయా' అంటూ చందూ చెప్పుకొచ్చాడు. ' అంటే కొన్నిసార్లు చిరాగ్గా ఉన్న సమయంలో కూడా డు యు లవ్‌ మీ' అని అంటారని నిఖిల్‌ చెప్పడంతో ఇంటర్వ్యూ ప్రోమో ముగిసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement