ఓటీటీలోనూ 'విక్రమ్‌' సరికొత్త రికార్డు.. | Kamal Haasan Vikram New Record In OTT | Sakshi
Sakshi News home page

Vikram Movie: ఓటీటీలోనూ దుమ్ములేపుతున్న కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌'..

Published Wed, Jul 13 2022 7:59 PM | Last Updated on Wed, Jul 13 2022 8:05 PM

Kamal Haasan Vikram New Record In OTT - Sakshi

Kamal Haasan Vikram New Record In OTT: ఉలగ నాయగన్‌ కమల్‌ హాసన్‌ సుమారు నాలుగేళ్ల తర్వాత 'విక్రమ్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమల్‌ హాసన్‌ కెరీర్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్‌ హాసన్‌ చేసిన యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులను కట్టిపడేశాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. 

జులై 8న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో రిలీజైన 'విక్రమ్‌' రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో 'బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ వీకెండ్‌' సాధించిందని డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న 'ఓపెనింగ్‌ వ్యూస్' రికార్డును ఈ మూవీ తిరగరాసిందని తెలిపారు. ఇంకా హైయెస్ట్‌ స్ట్రీమింగ్‌తో (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో) ఈ సినిమా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విజయం పట్ల కమల్‌ హాసన్‌ కూడా స్పందించారు. ''డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ద్వారా 'విక్రమ్‌' ప్రతీ ఇంటికి చేరడం ఆనందంగా ఉంది. ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విక్రమ్‌ బృందానికి శుభాకాంక్షలు'' అని తెలిపారు. 

చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?..
నితిన్‌ పాటకు మహేశ్‌ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్‌
ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement