కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు 2 సినిమాకు ఓటీటీ చిక్కులు ఎదురుకానున్నాయని తెలుస్తోంది. జులై 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సినిమాలో డైరెక్టర్ శంకర్ మార్క్ ఎక్కడా కనిపించకపోవడంతో ప్రేక్షకులు కూడా పెద్దగా ఆదరించలేదు. సినిమాపై ఆశలు పెట్టుకుని భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. దీంతో భారతీయుడు 2 ఓటీటీ విషయంలో సందిగ్ధత నెలకొనే అవకాశాలు ఉన్నాయి.
1996లో విడుదలైన భారతీయుడు సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్ 2 వచ్చింది. ఇందులో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు. సినిమా విడుదలకు ముందు భారీ బజ్ క్రియేట్ కావడంతో భారతీయుడు 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సుమారు రూ.120 కోట్లకు డీల్ సెట్ చేసుకుందని సమాచారం. అయితే, సినిమా విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది. దీంతో డీల్ ప్రకారం ఉన్న అంత మొత్తం చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ ముందుకు రావడం లేదట. ఈమేరకు లైకా ప్రొడక్షన్స్‌తో మళ్లీ చర్చలు జరిపి రూ. 60 కోట్లకు ఫైనల్ చేయాలని కోరిందట.
ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో భారతీయుడు ఓటీటీలో వచ్చేందుకు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో రజనీకాంత్ 'లాల్ సలామ్', టైగర్ ష్రాఫ్ 'గణపత్' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఇలాంటి అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. భారతీయుడు 2 కోసం సుమారు రూ. 250 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా.. అయితే, ఈ సినిమా రూ. 120 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment