
ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సూపర్ హిట్ కమ్‌బ్యాక్ ఇచ్చిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది.
Kamal Haasan Vikram Movie OTT Release Date Announced: ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సూపర్ హిట్ కమ్‌బ్యాక్ ఇచ్చిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది. ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య కీలక పాత్రల్లో నటించడంతో చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం జూన్ 3న విడుదలై అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది.
హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 'పద చూస్కుందాం' అంటూ రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టింది. రోబో 2.0 తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన రెండో తమిళ చిత్రంగా విక్రమ్ రికార్డు సృష్టించింది. 'విక్రమ్' వేట థియేటర్లలో పూర్తి కాగా ఇప్పుడు ఓటీటీల్లో కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జులై 8 నుంచి 'విక్రమ్' స్ట్రీమింగ్ కానున్నాడు.
చదవండి: 'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే..
ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్
A super hit addition to your watchlist coming soon! 😍
— Disney+ Hotstar (@DisneyPlusHS) June 29, 2022
Vikram: Hitlist streaming from July 8 in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. #VikramOnDisneyPlusHotstar 🔥😎 pic.twitter.com/bCO3KfVcOK