Kamal Haasan Vikram Movie OTT Release Date Confirmed, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Vikram Movie OTT Release: కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

Published Sat, Jun 4 2022 3:09 PM | Last Updated on Sat, Jun 4 2022 3:14 PM

Kamal Haasan Action Entertainer Vikram Movie OTT Release Date Out - Sakshi

లోకనాయకుడు కమల్‌ హాసన్‌, ఫాహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విక్రమ్‌. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో హీరో సూర్య ప్రత్యేక పాత్రలో మెరిశారు. విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌ పేరుతో తెలుగులో సుధాకర్‌ రెడ్డి, హీరో నితిన్‌ రిలీజ్‌ చేసిన ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులను అమ్మడం ద్వారా ఈ సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల మేర వెనకేసినట్లు తెలుస్తోంది. ఇక జూన్‌ 3న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని పలువురు ఆరా తీస్తున్నారు.

కాగా విక్రమ్‌ సినిమా డిజిటల్‌ హక్కులను హాట్‌స్టార్‌ ఇదివరకే సొంతం చేసుకుంది. థియేటర్లలో కలెక్షన్ల వేట తగ్గిన తర్వాతే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఇందుకు కనీసం నాలుగైదు వారాలైనా పడుతుంది. ఫిల్మీదునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం విక్రమ్‌ జూలై మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నాయి. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!

చదవండి: 'భారతీయుడు 2' సినిమాపై కమల్‌ హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
దివంగత సింగర్‌ కేకేకు క్షమాపణలు.. ఎలాంటి శత్రుత్వం లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement