మోహన్​ లాల్​ మరో క్రైమ్​ థ్రిల్లర్ '12th మ్యాన్'​​.. నేరుగా ఓటీటీలోకి | 12th Man: Jeethu Joseph Mohanlal Locked Thriller Trailer Released | Sakshi
Sakshi News home page

12th Man: మోహన్​ లాల్​ మరో క్రైమ్​ థ్రిల్లర్ '12th మ్యాన్'.. ట్రైలర్​ విడుదల

Published Wed, May 4 2022 4:48 PM | Last Updated on Wed, May 4 2022 4:54 PM

12th Man: Jeethu Joseph Mohanlal Locked Thriller Trailer Released - Sakshi

12th Man: Jeethu Joseph Mohanlal Locked Thriller Trailer Released: క్రైమ్​ థ్రిల్లర్​ జానర్స్​తో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను తెరకెక్కించే మలయాళ దర్శకులలో జీతు జోసేఫ్ ముందుంటారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన మరో క్రైమ్​ థ్రిల్లర్​ను రూపొందించారు. విలక్షణ నటుడు మోహన్​ లాల్​ ప్రధాన పాత్రలో తెరకెక్కింది '12th మ్యాన్' చిత్రం.​ (చదవండి: వావ్‌.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40)

ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ వేదికగా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్​ విడుదల చేసింది. 11 మంది స్నేహితులు వెకేషన్​కు వెళ్లినప్పుడు వారితో 12వ మనిషి కలుస్తాడు. ఆ 12వ మనిషి ఎవరు ? మిగతా 11 మందికి అతనికి ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలతో ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ట్రైలర్​ చూస్తుంటే క్రైమ్​తోపాటు, లాక్​డ్​ థ్రిల్లర్​లా ఉంది. ఈ మూవీ కూడా దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. 

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్‌!
 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement