విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన చిత్రానికి సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించారు. దాదాపు నాలుగేళ్ల పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొని షూటింగ్ పూర్తి చేసి.. గత నెలలో థియేటర్లలో రిలీజ్ చేశారు. టాక్ తేడా కొట్టేయడంతో ఇప్పుడు అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు అధికారిక తేదీ కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)
కమల్ హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన 'భారతీయుడు'.. 1996లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. లంచగొండితనం కాన్సెప్ట్ అప్పట్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. దీనికి సీక్వెల్‌ని తాజాగా జూలై 12న థియేటర్లలో రిలీజ్ చేశారు. కట్ చేస్తే కమల్ కెరీర్‌లోనే ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. కథాకథనాలు మరీ తీసికట్టుగా ఉన్నాయని ఆడియెన్స్ తేల్చేశారు.
ఇకపోతే భారతీయుడు 2 సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ముందు అనుకున్న ప్రకారం 6-8 వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఫ్లాప్ టాక్ రావడంతో ప్లాన్ మారింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఆగస్టు 9 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీలో రిలీజ్ ఉంటుందని ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)
Thatha varaaru, kadhara vida poraaru 🔥#Indian2 is coming to Netflix on 9 August in Tamil, Telugu, Malayalam and Kannada!#Indian2OnNetflix pic.twitter.com/cJN0JWaprp
— Netflix India South (@Netflix_INSouth) August 4, 2024
Comments
Please login to add a commentAdd a comment