Vikram Movie Success: Udhayanidhi Stalin Congratulates Kamal Haasan For Grand Success Of 'Vikram Movie' - Sakshi
Sakshi News home page

Vikram Movie: కమల్‌ హాసన్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పిన హీరో

Published Sat, Jun 4 2022 2:25 PM | Last Updated on Sat, Jun 4 2022 3:42 PM

Vikram Movie Success: Udhayanidhi Stalin Congratulates Kamal Haasan - Sakshi

నటుడు కమల్‌హాసన్‌ విక్రమ​ చిత్రంలో మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు.. తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్ర పోషించగా విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించారు.

అనిరుధ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తమిళనాడులో విక్రమ్‌ మూవీని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జాయింట్‌ మూవీస్‌ సంస్థ భారీ ఎత్తున విడుదల చేసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రానికి ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతించడం విశేషం. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తుండటంతో ఉదయనిధి స్టాలిన్‌ కమల్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: 'భారతీయుడు 2' సినిమాపై కమల్‌ హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
 ఆ హీరోతో నాలుగోసారి సినిమా చేస్తున్న సమంత !

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement