Vikram , Ante Sundaraniki, F3 Movies Get Ready To Release In OTT On July 2nd Week - Sakshi
Sakshi News home page

OTT: కొత్త సినిమాలతో కళకళలాడుతున్న ఓటీటీ వరల్డ్‌

Published Wed, Jul 6 2022 12:33 PM | Last Updated on Thu, Jul 7 2022 7:59 AM

Vikram , Ante Sundaraniki, F3 Movies Are Get Ready To Release In OTT On July Month - Sakshi

ఓటీటీ వరల్డ్ ఒక్కసారిగా కొత్త సినిమాలతో కళకళలాడుతోంది. ఇప్పటికే మేజర్, విరాటపర్వం మూవీస్ నెటిజన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ వారం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం, కమల్ హాసన్‌  కమ్ బ్యాక్ మూవీ ‘విక్రమ్’ ఓటీటీలోకి రానుంది. జులై 8 నుంచి హాట్ స్టార్ లో తెలుగు,తమిళం సహా ఇతర భాషల్లో స్ట్రీమ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కొల్లగొట్టిన విక్రమ్ థియేటర్స్ లోకి వచ్చిన 35 రోజుల్లో ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

(చదవండి: 1200 మందితో రామ్‌చరణ్‌ రిస్కీ ఫైట్‌!)

విక్రమ్ తో పాటు నాని నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అంటే సుందరానికి ఓటీటీ లోకి వచ్చేస్తోంది. జులై 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. థియేటర్స్ లోకి వచ్చిన నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్నాడు సుందరం. మరోవైపు సమ్మర్‌ సోగాళ్లు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నారు. విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా ఎఫ్‌3 జులై మూడో వారంలో సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

మరోవైపు మోడర్న్‌ లవ్‌ పేరుతో ఆంథాలజీ సిరీస్‌ని తీసుకొస్తోంది అమెజాన్‌ ప్రైమ్‌. హైదరాబాద్ నేపథ్యంలో 6 కథలను ఇందులో చూపించనుంది. ఆదిపిని శెట్టి, నిత్యామీనన్, రీతువర్మ, సుహాసిని, రేవతి, నరేష్ , మాళవిక నాయర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ ఆరు కథలను నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక  తెరకెక్కించారు. జులై 8 నుంచే ఈ ఆంథాలజీ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement