Lokesh Kanagaraj Going To Take Break From From All Social Media, Deets Inside - Sakshi
Sakshi News home page

Lokesh Kanagaraju: ఫ్యా‍న్స్‌కి షాక్‌.. సోషల్‌ మీడియాకు ‘విక్రమ్‌’ డైరెక్టర్‌ బ్రేక్‌..

Aug 2 2022 3:23 PM | Updated on Aug 2 2022 4:21 PM

Lokesh Kanagaraj Announces He Is Take Short Break From All Social Media - Sakshi

మాస్టర్, విక్రమ్ వంటి చిత్రాలతో కోలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజు ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. తాను సోషల్‌ మీడియాకు బ్రేక్‌ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ షాక్‌కు గురవుతున్నారు. ఆయన తదుపరి సినిమా ఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ ఆయన తాజా నిర్ణయంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..

ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘హే గాయ్స్.. నేను అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నేను నా నెక్ట్స్ సినిమా ప్రకటనతో తిరిగి వస్తాను. అప్పటి వరకు అందరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా. లవ్‌ యూ’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా దాదాపు నాలుగేళ్లుగా సక్సెస్‌ లేని కమల్‌ హాసన్‌కు ఈ యంగ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించాడు. ఈ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళు చేసి సంచలన రికార్డు క్రియేట్‌ చేసింది. లోకేశ్‌ ‘విక్రమ్‌’ తెరకెక్కించిన తీరుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో తెలుగు, తమిళంలో ఆయన పేరు మారిమ్రోగిపోతుంది.

చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

ఆయన నేరుగా తెలుగు హీరోతో ఓ సినిమా చేస్తే బాగుండు అని టాలీవుడ్‌ ప్రేక్షకులు కోరుకుంటుంటే.. విజయ్‌తో చేసే ఆయన నెక్ట్‌ మూవీ అప్‌డేట్‌ ఎప్పుడేప్పుడా కోలీవుడ్‌ ఆడియన్స్‌ వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్‌ మీడియాక షార్ట్‌ బ్రేక్‌ తీసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకు ఆయన సడెన్‌ నిర్ణయం తీసుకున్నారని, అంటే ఇప్పుట్లో విజయ్‌ సినిమా రానట్టేనా? అంటూ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. కాగా విజయ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్‌ చేయబోతున్నట్లు ఇటీవల లోకేశ్‌ కనకరాజ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement