లియో డైరెక్టర్ సంచలన నిర్ణయం.. ఎందుకంటే? | Leo Director Lokesh Kanagaraj Taken Key Decision About Next Project | Sakshi
Sakshi News home page

Lokesh Kanagaraj: 'ఎక్కడా అందుబాటులో ఉండను'.. లోకేశ్ కనగరాజ్ షాకింగ్ డెసిషన్!!

Published Sun, Dec 17 2023 1:04 PM | Last Updated on Sun, Dec 17 2023 2:21 PM

Leo Director Lokesh Kanagaraj Taken Key Decision About Next Project - Sakshi

లియో మూవీతో సూపర్‌ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే లియో హిట్ తర్వాత సూపర్ స్టార్‌ రజినీకాంత్‌తో జత కట్టనున్నారు. అయితే తాజాగా లోకేశ్ కనగరాజ్‌ చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది.

ఇటీవల తన జీ స్క్వాడ్‌ బ్యానర్‌లో తెరకెక్కించిన మొదటి చిత్రం ఫైట్ క్లబ్‌ను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. తన రాబోయే ప్రాజెక్ట్ కోసం లోకేశ్ కనగరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తదుపరి సినిమా కోసం సోషల్ మీడియాతో పాటు మొబైల్‌కు కూడా విరామం ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ మేరకు తన ట్విటర్‌లో ఓ నోట్ రాసుకొచ్చారు. ప్రాజెక్ట్‌పై పూర్తిస్థాయిలో పని చేసేందుకు ఈ నిర్ణయమని పేర్కొన్నారు. దయచేసి ఈ సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండనని చెప్పుకొచ్చారు. నా కెరీర్ ప్రారంభం నుంచి అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం లోకేశ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement