Kajol Announces Break From Social Media Shares On Instagram - Sakshi
Sakshi News home page

Kajol: సోషల్ మీడియాకు కాజోల్ కటీఫ్.. కారణం అదేనా?

Jun 9 2023 5:11 PM | Updated on Jun 9 2023 5:32 PM

Kajol Announces Break From Social Media Shares In Instagram - Sakshi

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్‌ కాజోల్‌. కుచ్‌ కుచ్‌ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్‌, త్రిభంగ, కరణ్‌ అర్జున్‌, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి సూపర్ హిట్  సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

షాకింగ్ నిర్ణయం!

అయితే తాజాగా కాజోల్ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది బాలీవుడ్ భామ. 'నా జీవితంలో చాలా కష్టమైన పరీక్షను ఎదుర్కొబోతున్నా' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇన్‌స్టాలో తన ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు చేసిన పోస్ట్ మాత్రమే తన ఖాతాలో కనిపిస్తోంది. కాగా.. కాజోల్‌కు దాదాపు 14 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటున్నారో కారణాలు వెల్లడించలేదు. 

(ఇది చదవండి: పంచ్‌ ప్రసాద్‌కు ఆపరేషన్‌.. అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో)

ప్రచారం కోసమేనా?

కానీ కొంతమంది ఫ్యాన్స్ ఆమె రాబోయే వెబ్‌ సిరీస్‌ 'ది గుడ్ వైఫ్' కోసం ఇదంతా ప్రచార వ్యూహమని భావిస్తున్నారు. 'ది గుడ్ వైఫ్ - ప్యార్, కానూన్, ధోకా' సిరీస్‌లో కాజోల్ లాయర్ పాత్రను పోషించింది. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. కాగా.. 2016లో అమెరికాలో తెరకెక్కించిన ఈ సిరీస్‌లో జూలియానా మార్గులీస్ ప్రధాన పాత్రలో నటించారు.

కాజోల్‌కు మద్దతు

అయితే కాజోల్ నిర్ణయం పట్ల నెటిజన్స్‌ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడం మీకు మంచి చేస్తుందని భావిస్తున్నాం అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ మీ జీవితంలో ఎదురైన కష్టతరమైన పరీక్ష నుంచి త్వరలో బయటపడాలని కోరుకుంటున్నామంటూ కామెంట్ చేశాడు. ఈ విషయంలో నెటిజన్స్  కాజోల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మీ నిర్ణయంతో ఇకపై మీ అందమైన పోస్టులను కోల్పోతామని కొందరు ఫీలవుతుండగా.. మీరు ఇన్ స్టాలో ఉన్నా, లేకున్నా, ఎప్పటికీ మీ మీద ప్రేమ, అభిమానం అలాగే ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: అజయ్‌ నా లవ్‌ ఎట్ ఫస్ట్ సైట్ కాదు.. కాజోల్ షాకింగ్ కామెంట్స్)

కాగా.. కాజోల్ త్వరలోనే లస్ట్ స్టోరీస్‌-2 వెబ్ సిరీస్ ప్రేక్షకుల  ముందుకు రానుంది. నెటిఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా, మృణాల్, నీనా గుప్తా, కుముద్ మిశ్రా, అమృతా సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ, తిలోత్తమా షోమే నటించారు. ఈనెల 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు సుజోయ్ ఘోష్, ఆర్. బల్కి, నటి కొంకణ్ సేన్ శర్మ, అమిత్రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు.   


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement